మూవీ బజ్: బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి | Kumar Vishwas Set For His Bollywood Debut | Sakshi
Sakshi News home page

మూవీ బజ్: బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి

Jul 22 2014 4:39 AM | Updated on Apr 4 2018 7:42 PM

మూవీ బజ్: బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి - Sakshi

మూవీ బజ్: బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, వివాదాస్పద వికటకవి కుమార్ విశ్వాస్ బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. త్వరలో విడుదల కానున్న ‘భైరవి’ చిత్రానికి ఆయన పాట రాశారు.

బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, వివాదాస్పద వికటకవి కుమార్ విశ్వాస్ బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. త్వరలో విడుదల కానున్న ‘భైరవి’ చిత్రానికి ఆయన పాట రాశారు. వెటరన్ గాయని ఆశాభోంస్లే ఈ పాట పాడనున్నారు. తాను రాసిన పాటను ఆమె పాడటం వల్ల  తన కల నెరవేరిందంటున్నాడు విశ్వాస్.
 
 విజయనారి.. సాండ్రా సరి
 ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీతో మల్టీబిలియన్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగిన మార్కెటర్ బ్రౌనీ వైస్ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ‘టప్పర్‌వేర్ అన్‌సీల్డ్’లో సాండ్రా బుల్లక్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. బ్రౌనీ జీవిత కథను రాసిన బాబ్ కీలింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.  

 పొడగరి.. సొగసరి
 ‘బాలీవుడ్‌లో అత్యంత పొడగరి హీరోయిన్ ఎవరు?’...  ఎ) హుమా ఖురేషీ, బి) కత్రినా కైఫ్, సి) దీపికా పడుకొనే, డి) ప్రీతీజింటా. ఇదేమీ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న కాదు. కేరళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పోటీపరీక్షలోనిది. పరీక్షలో ఇలాంటి ప్రశ్న అడగటంతో ‘ట్విట్టర్’లో రచ్చ మొదలైంది. సమాధానం దీపిక పడుకొనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement