breaking news
Akash Goparaju
-
సునీత తనయుడి కొత్త మలుపు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించిన తాజా చిత్రం కొత్త మలుపు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కోనసీమ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ మూవీగా రూపొందించారు. తాజాగా ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కొత్త మలుపు కథేంటంటే..జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాపీగా గడిపే యువకుడు కమల్ (ఆకాశ్). ఓ కుటుంబ వివాహ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని అందమైన గ్రామానికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే గ్రామీణ యువతిని చూసి ఆకర్షితుడవుతాడు. ఒక రాత్రి అనుకోని పరిస్థితుల్లో అవమానకర స్థితిలో చిక్కుకున్న కమల్‌ను ఓ యువతి కాపాడుతుంది. అయితే ఆమె ఎవరో తెలియదు. తనను ఆదుకున్న ఆ అమ్మాయి కోసం కమల్ చేసే అన్వేషణలో వరలక్ష్మి అతనికి తోడుగా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.అయితే, తాను వెతుకుతున్న అమ్మాయి వరలక్ష్మినేనని తెలుసుకునేలోపే, ఆమె మరో యువకుడితో ఉన్న ఫోటో కమల్ చేతికి చిక్కుతుంది. దాంతో ప్రేమలో అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ యువకుడు ఎవరు? వరలక్ష్మికి అతనితో సంబంధం ఏమిటి? ఈ అపార్థాల మధ్య కమల్-వరలక్ష్మి ప్రేమ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది? చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా? అన్నదే కొత్త మలుపు కథ.ఎలా ఉందంటే..ప్రేమ, అపార్థాలు, నమ్మకం, గతం-వర్తమానం మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణను దర్శకుడు శివ కేసనకుర్తి చక్కగా తెరపై ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు గోదావరి ప్రాంతం అందాలను జోడించి ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించారు. సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. పల్లెటూరి విజువల్ అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి సందడి, హీరో-హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, గోదావరి కామెడీ మంచి ఎంటర్టైనింగ్గా అనిపించాయి.రెండో అర్ధభాగంలో కథ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో అనుమానం ఎంత ప్రమాదకరమో డైరెక్టర్ ఇందులో చూపించారు. ఒకరి గతాన్ని పట్టుకుని తీర్పు చెప్పడం ఎంత తప్పో చెప్పే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో వచ్చే సందేశం నేటి యువతకు ఎంతో అవసరమనే మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. "ప్రతి ఒక్కరికీ ఒక గతం ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి వర్తమానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు" అనే ఒక్క డైలాగ్‌లో తన స్టోరీ సారాంశం చెప్పేశారు.ఎవరెలా చేశారంటే.. కమల్ పాత్రలో ఆకాశ్ అదరగొట్టేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ భైరవి వరలక్ష్మి పాత్రలో మెప్పించింది. రఘుబాబు, పృథ్వీ తమ కామెడీ టైమింగ్‌తో గోదావరి యాసలో అలరించారు. గోపి పాత్రలో సిద్ధు మంచి నటన కనబరిచాడు. ఇక సాంకేతికత విషయానికొస్తే యశ్వంత్ నాగ్ సంగీతం ఆకట్టుకుంది. సుమంత్ కచర్ల సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి ప్రాంతంలోని ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఎడిటింగ్‌లో మరింత పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
ఊహించలేని మలుపులున్నాయి: ఆకాష్
‘‘విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం రొమాంటిక్ అండ్ కామెడీ సబ్జెక్ట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాను. నటుడిగా కొంత ప్రయాణం చేసిన తర్వాత యాక్షన్ చిత్రాలు కూడా చేస్తాను. ఒకే జానర్‌కే నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు’’ అని ఆకాష్ గోపరాజు చెప్పారు.ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా, భైరవి ఆరాధ్య హీరోయిన్గా నటించిన రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ సినిమా ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాష్ గోపరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘కోనసీమ నేపథ్యంతో సాగే విలేజ్ లవ్ స్టోరీ ఇది.పల్లెటూరి అందాలు, నవ్వులు, ఎమోషన్స్ , సస్పెన్స్ , ప్రేమ.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో రూపొందించాం. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే చాలా ఎనర్జిటిక్ పాత్ర చేశాను. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్లే కథలో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. బాలకృష్ణగారు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతం, ఆర్ఆర్ ప్లస్ అవుతుంది. మా అమ్మగారు ఈ సినిమా ఔట్పుట్ పట్ల సంతోషించారు’’ అని చెప్పారు. -
సింగర్ సునీత తనయుడి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు. -
సింగర్ సునీత తనయుడి ప్రేమ కథలో ‘కొత్త మలుపు’
ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది.హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు.దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అన్నారు.గాయని సునీత మాట్లాడుతూ, ‘ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణం” అన్నారు.హీరో ఆకాష్ మాట్లాడుతూ..‘ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు’అన్నారు.హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, ‘నా కెరీర్లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి’ అని చెప్పారు. -
సర్కారు నౌకరి టీజర్.. ఎమోషనలైన సింగర్ సునీత
గాన మాధుర్యంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించే గాయని సునీత. తెలుగులో టాప్ సింగర్‌గా వెలుగొందుతున్న ఈమె తనయుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సర్కారు నౌకరి పేరుతో తీస్తున్న ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తుండగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. భావనా వళపండల్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో బ్యానర్ స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. 1996లో కొల్లాపూర్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం అంటూ టీజర్ ప్రారంభమవుతుంది. నువ్వు చేసిన పూజలన్నీ ఫలించినయ్.. సర్కారు నౌకరున్నోడు నీ మొగుడు కాబోతుండు అన్న డైలాగ్‌తో హీరో ప్రభుత్వ ఉద్యోగి అని అర్థమవుతోంది. టీజర్ అయితే ఆసక్తికరంగా సాగింది. సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు అన్నారు. దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ.. 'ఈ మధ్య పంచతంత్ర కథలు అనే వెబ్ సిరీస్ చేశాను. ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఆయన ఆఫీస్‌కు రమ్మని పిలిచారు. వెళ్లి కలిస్తే నేను పంచతంత్ర కథలు ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ చేశానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే అది ఎక్కడికైనా చేరుతుందని అర్థమైంది. ఒక లైన్ కథ వినిపిస్తే ఆయనకు నచ్చింది. వెంటనే మా సంస్థలో చేద్దామని చెప్పారు. నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెబుతున్నా' అన్నారు. సింగర్ సునీత మాట్లాడుతూ.. 'రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. ఈ సంస్థలో డబ్బింగ్ చెప్పాం, పాటలు పాడాను, ఇది మాకు హోమ్ బ్యానర్ లాంటిది. నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నా ఇంత ఎమోషనల్ కాలేదు. ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడటం ఉద్వేగంగా ఉంది. రాఘవేంద్రరావు గారు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు సంస్కారం,మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా లైఫ్ లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావొచ్చు. ఈ సినిమాలో నేనొక ప్రమోషనల్ సాంగ్ పాడాను. సర్కారు నౌకరి సినిమా బాగా వచ్చింది' అని చెప్పింది. చదవండి: 8 ఏళ్లకే ఇండస్ట్రీలో ఎంట్రీ.. హీరోయిన్గా మారిన డ్యాన్సర్


