ఊహించలేని మలుపులున్నాయి: ఆకాష్‌ | Akash Goparaju about Kotha Malupu Movie | Sakshi
Sakshi News home page

ఊహించలేని మలుపులున్నాయి: ఆకాష్‌

Jun 9 2026 12:06 AM | Updated on Jun 9 2026 12:06 AM

Akash Goparaju about Kotha Malupu Movie

‘‘విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. ప్రస్తుతం రొమాంటిక్‌ అండ్‌ కామెడీ సబ్జెక్ట్‌ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాను. నటుడిగా కొంత ప్రయాణం చేసిన తర్వాత యాక్షన్  చిత్రాలు కూడా చేస్తాను. ఒకే జానర్‌కే నన్ను నేను పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు’’ అని ఆకాష్‌ గోపరాజు చెప్పారు.

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్‌ గోపరాజు హీరోగా, భైరవి ఆరాధ్య హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్‌ లవ్‌ అండ్‌ సస్పెన్స్  ఎంటర్‌టైనర్‌ సినిమా ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ నెల 12న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాష్‌ గోపరాజు విలేకరులతో మాట్లాడుతూ–‘‘కోనసీమ నేపథ్యంతో సాగే విలేజ్‌ లవ్‌ స్టోరీ ఇది.

పల్లెటూరి అందాలు, నవ్వులు, ఎమోషన్స్ , సస్పెన్స్ ,  ప్రేమ.. ఇలా అన్ని అంశాల మేళవింపుతో రూపొందించాం. నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే చాలా ఎనర్జిటిక్‌  పాత్ర చేశాను. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్లే కథలో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. బాలకృష్ణగారు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం, ఆర్‌ఆర్‌ ప్లస్‌ అవుతుంది. మా అమ్మగారు ఈ సినిమా ఔట్‌పుట్‌ పట్ల సంతోషించారు’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement