'పెద్ది' కోసం తెలుగు ట్రైనింగ్.. వర్షం పడింది | Actor Shiva Rajkumar Reveals Interesting Details About Ram Charan Peddi Movie Shooting Details | Sakshi
Sakshi News home page

Peddi Shooting Update: శివరాజ్ కుమార్ చెప్పిన 'పెద్ది' సంగతులు

Apr 16 2025 10:23 AM | Updated on Apr 16 2025 11:27 AM

Shiva Rajkumar Reveals Peddi Movie Shoot Details

'గేమ్ ఛేంజర్' దెబ్బకు మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇప్పుడు వాళ్లందరి కళ్లు 'పెద్ది'(Peddi Movie)పైనే ఉన్నాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్.. రీసెంట్ గా శ్రీరామ నవమి సందర్భంగా రిలీజైంది. సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే చకచకా షూటింగ్ జరుగుతోంది. 

తాజాగా తను నటించిన '45' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shiva Rajkumar).. 'పెద్ది' షూటింగ్ సంగతులు కూడా చెప్పుకొచ్చాడు. షూటింగ్ మొదలవడానికి 20 రోజుల ముందు హైదరాబాద్ వచ్చానని, దర్శకుడు బుచ్చిబాబు దగ్గర తెలుగు నేర్చుకున్నానని అన్నాడు.

(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?) 

అలా తెలుగు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సెట్స్ లో అడుగుపెట్టానని చెప్పిన శివరాజ్ కుమార్.. తెలుగులోనే డైలాగ్స్ చెప్పానని, పెద్ది సినిమా మంచి ఎక్స్ పీరియెన్స్ ఇస్తోందని చెప్పాడు. 2 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నని.. వర్షం కురిసి ప్రకృతి తనకు స్వాగతం పలికిందని చెప్పుకొచ్చాడు. పెద్ది గ్లింప్స్ అయితే తనకు చాలా నచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

చరణ్, జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'పెద్ది'లో కన్నడ స‍్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానూ ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. ‍అయినా బాధ లేదు) 

Advertisement
 
Advertisement
Advertisement