ప్రముఖ బుల్లితెర నటి ఇంటి కిచెన్ లో ప్రమాదం | Serial Actress Indraneil Meghna Shares Gas Stove Incident | Sakshi
Sakshi News home page

ప్రముఖ బుల్లితెర నటి ఇంటి కిచెన్ లో ప్రమాదం

Jan 30 2025 8:04 PM | Updated on Jan 30 2025 8:53 PM

Serial Actress Indraneil Meghna Shares Gas Stove Incident

బుల్లితెర జంట ఇంద్రనీల్‌ (Indraneil)-మేఘన (Meghana)కు పెద్ద ప్రమాదమే తప్పింది. వారి ఇంట్లో గ్యాస్‌స్టవ్‌ పేలింది. ఆ ఘటన జరిగిన సమయంలో కిచెన్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడు గురించి మేఘన మాట్లాడుతూ.. నేను స్టవ్‌పై ఒక ఆమ్లెట్‌ వేసుకుని హాల్‌లో కూర్చున్నాను. ఇంతలో సడన్‌గా కరెంట్‌ రావడంతో టప్‌మని ఏదో బ్లాస్ట్‌ అయినట్లు శబ్ధం వచ్చింది. 

నా కళ్ల ముందే..
ఏసీ పేలిందేమోనని అన్ని గదుల్లోకి వెళ్లి చూశా.. ఎక్కడా ఏం కనిపించలేదు. కిచెన్‌కు వచ్చేసరికి గ్లాస్‌ స్టవ్‌ నా కళ్లముందే ఇంకా పగులుతోంది. మూడేళ్లకిందటే ఈ స్టవ్‌ తీసుకున్నాను. అంతలోనే ఇలా జరిగింది. నా ఒక్కరికే కాదు చాలామందికి ఇలాంటి సమస్య ఎదురైంది. ఒకరింట్లోనైతే వారి తల్లి వంట చేస్తుండగా ఆ స్టవ్‌ పేలి ఆ గాజుముక్కలు తన ముఖానికి గుచ్చుకున్నాయంట! 

ఇంద్రనీల్‌- మేఘన ఇంట్లో పేలిన గ్యాస్‌స్టవ్‌ ఫోటోల

నా కెరీర్‌ ఏం కావాలి?
నేను ఆర్టిస్ట్‌ను. స్టవ్‌ పేలేసమయంలో నేనూ అక్కడే ఉండుంటే ఆ ముక్కలు నా ముఖానికి గుచ్చుకుంటే నా పరిస్థితేంటి? నా కెరీర్‌ ఏం కావాలి? ఇది చిన్న ప్రమాదం కాదు. దీనిపై కచ్చితంగా కోర్టుకెళ్తాం. గ్లాస్‌ స్టవ్‌ వాడాలంటేనే భయంగా ఉంది. అందుకే ఇకపై స్టీల్‌ స్టవ్‌ వాడతాను. దయచేసి వంటింట్లో అందరూ జాగ్రత్తగా ఉండండి అని మేఘన సూచించింది. కాగా వీరిద్దరూ చక్రవాకం సీరియల్‌లో నటించారు.

చదవండి: ఆ విషయంలో ప్రభాస్‌ గ్రేట్‌.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్‌

Advertisement
 
Advertisement
Advertisement