వేటాడే సత్యభామ  | Satyabhama teaser: Watch Kajal Aggarwal fearless cop avatar | Sakshi
Sakshi News home page

article header script

వేటాడే సత్యభామ 

Published Sat, Nov 11 2023 3:29 AM | Last Updated on Sat, Nov 11 2023 3:29 AM

Satyabhama teaser: Watch Kajal Aggarwal fearless cop avatar - Sakshi

‘సత్యా.. ఈ కేసు నీ చేతుల్లో లేదు (ప్రకాశ్‌రాజ్‌).. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్‌ (కాజల్‌ అగర్వాల్‌)’ అనే డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘సత్యభామ’ టీజర్‌. పోలీసాఫీసర్‌ సత్యభామ పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న చిత్రం ఇది. ప్రకాశ్‌రాజ్, నవీన్‌ చంద్ర కీలక పాత్రధారులు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం ‘సత్యభామ’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘సార్‌.. ఆ గిల్ట్‌ నన్ను వెంటాడుతూనే ఉంది. వేటాడాలి (కాజల్‌ అగర్వాల్‌)’, ‘ఆ అమ్మాయి చావుకు మీరే కారణం అంటున్నారు. ఈ కేసును మీరు వదిలేసినట్లేనా? (విలేకర్లు).. నెవర్‌ (కాజల్‌)’ అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement