సమ్మర్‌లో సత్యభామ | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో సత్యభామ

Published Sun, Nov 5 2023 1:00 AM

Satyabhama teaser to be out for Deepavali - Sakshi

కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌లో, నవీన్‌ చంద్ర, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్‌ ప్లే కూడా అందించారు.

కాజల్‌ అగర్వాల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను దీపావళికి రిలీజ్‌ చేయనున్నట్లుగా యూనిట్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 60 శాతం పూర్తయింది. ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభిస్తాం. సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:   శ్రీ చరణ్‌ పాకాల, సహనిర్మాత: బాలాజీ.

Advertisement
 
Advertisement