వజ్రాల హారం చోరీ కేసులో హీరో జయం రవి డ్రైవర్‌ అరెస్ట్‌ | Ravi Mohan Driver Arrested By Police For Stealing Diamond Necklace | Sakshi
Sakshi News home page

హీరో జయం రవి ఇంట్లో చోరీ కేసు: డ్రైవర్ అరెస్ట్!

Jul 3 2026 3:01 PM | Updated on Jul 3 2026 3:28 PM

Ravi Mohan Driver Arrested By Police For Stealing Diamond Necklace

ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్‌ (జయం రవి) ఇంట్లో జరిగిన వజ్రాల హారం చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దొంగతనానికి సంబంధించి జయం రవి వ్యక్తిగత డ్రైవర్ రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కొద్దిరోజుల క్రితం నటుడి నివాసం నుండి విలువైన వజ్రాల హారం మాయమవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇంట్లో పనిచేసే సిబ్బందిని, డ్రైవర్లను ఒక్కొక్కరిగా పిలిపించి విచారించారు.ఈ విచారణ సమయంలో డ్రైవర్ రాజేష్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. 

దాంతో అతడిని మరింత లోతుగా ప్రశ్నించగా, జయం రవి ఇంట్లో దొంగతనం చేసినట్లు రాజేష్ అంగీకరించాడు. నటుడి నివాసం నుండి ₹2.5 లక్షల నగదును తానే చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, వజ్రాల హారం రికవరీపై మరింత విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement