Rashmika Mandanna Spotted In Same Shirt As Rumoured Boyfriend Vijay Deverkonda? - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రౌడీ హీరో షర్ట్‌తో ప్రత్యక్షమైన నేషనల్‌ క్రష్‌.. ఇప్పుడేమని బుకాయిస్తుందో!

Jul 27 2023 10:58 AM | Updated on Jul 27 2023 11:16 AM

Rashmika Mandanna Spotted In Same Shirt As Boyfriend Vijay Deverkonda - Sakshi

తాజాగా రష్మిక మరోసారి ఇటువంటి అనుమానాలకు తావిచ్చింది. ఎయిర్‌పోర్టులో కనిపించిన ఈ బ్యూటీ విజయ్‌ దేవరకొండ షర్ట్‌తో దర్శనమిచ్చింది. కార్గో పాయింట్స్‌పై వైట్‌ క్రాప్‌ టాప్‌ ధ

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తమ మధ్య లవ్‌ లేదన్నా సరే అభిమానులు ఉందని వాదిస్తూ వస్తున్నారు. వీరిద్దరూ తరచూ సీక్రెట్‌గా షికారుకు వెళ్లడం, డిన్నర్‌ డేట్‌కు వెళ్లడం, వెకేషన్‌లో ఎంజాయ్‌ చేయడం చేస్తున్నారు. కానీ వీరు షేర్‌ చేసిన ఫోటోల ద్వారా ఇద్దరూ ఒకే ప్లేస్‌లో ఉన్నారని ఫ్యాన్స్‌ సులువుగా గుర్తుపట్టేస్తున్నారు. అలా తమది స్నేహమే అని వాళ్లు చెప్తున్నా సరే, అంతకుమించి మీ మధ్య ఏదో జరుగుతుందని నెటిజన్లు డౌటానుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

తాజాగా రష్మిక మరోసారి ఇటువంటి అనుమానాలకు తావిచ్చింది. ఎయిర్‌పోర్టులో కనిపించిన ఈ బ్యూటీ విజయ్‌ దేవరకొండ షర్ట్‌తో దర్శనమిచ్చింది. కార్గో పాయింట్స్‌పై వైట్‌ క్రాప్‌ టాప్‌ ధరించిన ఆమె దానిపై చెక్స్‌ షర్ట్‌ వేసుకుంది. వదులుగా ఉన్న ఈ షర్ట్‌ రౌడీ హీరోదేనని అభిమానుల అభిప్రాయం. గతంలో అతడు ఈ చెక్స్‌ షర్ట్‌ ధరించిన ఫోటోను తాజాగా రష్మిక ఫోటోను పక్కనపెట్టి పోలుస్తూ లవ్‌ బర్డ్స్‌ పనిలో పడి ఒకరినొకరు బాగా మిస్‌ అవుతున్నట్లున్నారే అని కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌లో నటిస్తోంది. అలాగే రెయిన్‌ బోతో పాటు మరో తెలుగు సినిమా, హిందీలో యానిమల్‌ చిత్రం చేస్తోంది. ఇంత బిజీగా ఉండటం వల్లే నితిన్‌ సినిమాకు కాల్‌షీట్స్‌ అడ్జస్ట్‌ అవక సదరు సినిమా నుంచి వైదొలిగింది. ఇకపోతే తమిళ హీరో ధనుష్‌- తెలుగు డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక నటిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: మరోసారి వివాదంలో బిగ్‌బాస్‌.. మొదలవడానికి ముందే
చిన్న గ్యాప్‌ తర్వాత కోలీవుడ్‌లో సినిమా చేస్తున్న అతిథి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement