Aditi Rao Hydari Doing Lady-Oriented Movie - Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: సిద్దార్థ్‌తో లవ్‌ రూమర్స్‌.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో హీరోయిన్‌

Jul 27 2023 9:33 AM | Updated on Jul 27 2023 10:00 AM

Aditi Rao Hydari Doing Lady Oriented Movie - Sakshi

అదేవిధంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్‌ వైరల్‌ అవుతోంది. ఇకపోతే మరాఠీ, ఆంగ్లం చిత్రాల్లోనూ నటిస్తున్న అతిథి రావ్‌ చిన్న గ్యాప్‌ తర్వాత తాజాగా తమిళం, తెలు

బహుభాషా నటి అతిథి రావు హైదరి.. బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసిన తర్వాత అక్కడ పలు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించింది. ఈ బ్యూటీని మణిరత్నం కోలీవుడ్‌కి పరిచయం చేశారు. కార్తీకి జంటగా 'కాట్రు వెలియిడై' అనే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ మణిరత్నమే సెక్క సెంవంద వానం చిత్రంలో అవకాశం కల్పించారు. ఆ మధ్య హే సినామికా చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌, కాజల్‌ అగర్వాల్‌ లతో కలిసి నటించిన ఈమె సముద్రం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ సమయంలోనే ఆ చిత్ర కథానాయకుడు సిద్ధార్థతో పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జోరందుకుంది. అదేవిధంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని టాక్‌ వైరల్‌ అవుతోంది. ఇకపోతే మరాఠీ, ఆంగ్లం చిత్రాల్లోనూ నటిస్తున్న అతిథి రావ్‌ చిన్న గ్యాప్‌ తర్వాత తాజాగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి రాజేష్‌ సెల్లా దర్శకత్వం వహించినట్లు సమాచారం.

నాజర్‌, వసుంధర కలిసి నటించిన కాలైప్పణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ఈయన ఆ తరువాత విక్రమ్‌, త్రిష జంటగా నటించిన తూఝగావనం, విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన కడారం కొండాన్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఆరై అనే వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించారు. కాగా నటి అతిథి రావ్‌ ప్రధాన పాత్రలో నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చదవండి: విశ్వక్‌ సేన్‌ కౌంటర్స్‌.. బేబీ డైరెక్టర్‌కేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement