రష్మికను మోసం చేసిన మేనేజర్‌! | Sakshi
Sakshi News home page

రష్మిక నుంచి ఎంత డబ్బు కొట్టేశాడంటే?

Published Sun, Jun 18 2023 5:36 PM

Rashmika Mandanna Allegedly Cheated By Her Manager - Sakshi

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నిరోజుల్లోనే టాప్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో రష్మిక మందన చోటు సంపాదించుకుంది . ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ బ్యూటీ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో ఫిదా చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకుంది. తాజాగా మీడియా కథనాల ప్రకారం రష్మిక గురించి ఒక వార్త వైరల్‌ అవుతుంది.

(ఇదీ చదవండి: శ్రీజతో విడాకులు.. కల్యాణ్‌ దేవ్‌ కన్‌ఫర్మ్‌ చేసినట్లేనా?)

తన వద్ద చాలా రోజులుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్‌ మోసం చేశాడని తెలుస్తోంది. ఆమె నుంచి దాదాపు రూ. 80 లక్షలు దొంగలించాడని సమాచారం. దీంతో రష్మిక అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వ్యవహారంపై ఆమె మౌనంగానే ఉంది. మరోవైపు రష్మిక ఈ ఏడాది ‘పుష్ప2’ తో పాటు, రణ్‌బీర్‌కపూర్‌, సందీప్‌ వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్‌’ చిత్రంలోనూ నటిస్తోంది.

(ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?)

Advertisement
 
Advertisement