తమిళ నటుడు రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణ రావు గైక్వాడ్ (84) గుండెపోటుకు గురయ్యారు. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఈ వార్త అందిన వెంటనే రజనీకాంత్ చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. తన సోదరుడితో పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రికి రజనీ వెళ్తున్నప్పుడు కొందరు తీసిని వీడియోలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అభిమానులు కూడా.. సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన కోలుకుంటారని ఆశాభావం వైద్యులు వ్యక్తం చేశారు.
సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు గతంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆపై కొంత కాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో తరుచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం.


