వైజాగ్‌లో వారణాసి | Rajamouli Varanasi Begins Shooting Schedule in Vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో వారణాసి

Jun 13 2026 2:30 AM | Updated on Jun 13 2026 5:57 AM

Rajamouli Varanasi Begins Shooting Schedule in Vizag

వైజాగ్‌లో తన టీమ్‌తో సహా ల్యాండ్‌ అయ్యారు రాజమౌళి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మైథాలజీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో ప్రియాంకా  చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ వైజాగ్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఇప్పటికే రాజమౌళి వైజాగ్‌ చేరుకున్నారు. మహేశ్‌బాబు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్‌లో చిత్రీకరిస్తారట. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement