స్టార్ హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో డ్రాగన్ ఫేం దర్శకుడు అశ్వత్ మారిమత్తు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధర్మన్’. ఈ సినిమాలో రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పనిచేసిన అనుభవం.. ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో.. ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
నటులు ఖైదీలు..
రజినీకాంత్ సూపర్‌స్టార్ హోదా కంటే.. ఆయనలోని గొప్ప విషయాలను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే రజినీ సార్ ఒక మాట చెప్పారు. నటులు ఖైదీలు అని అన్నారు. తొలిత నాకు అర్థంకాలేదు. తర్వాత అర్థమైంది. స్టార్‌డమ్ వచ్చిన తర్వాత మనలోని స్వేచ్ఛని కొంత భాగాన్ని కోల్పోవల్సి వస్తుందని అతని ఉద్దేశం’ అని తెలిపింది. ఈ సినిమాలో రజినీకాంత్ పోషిస్తున్న ధర్మన్ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే పాత్ర నాది’ అని పేర్కొంది.
ఈ అవకాశం ఎలా వచ్చిందంటే..
‘2025లో విడుదలైన డ్రాగెన్ మూవీ నాకు ఎంతగానో నచ్చింది. ఈ విషయమై అశ్వత్‌కు మెసేజ్ చేశా. త్వరలోనే మనం కలిసి పనిచేద్దాం అంటూ రిప్లై ఇచ్చారు. గడిచిన కొద్ది రోజుల్లోనే ‘ద టైం హ్యాజ్ కమ్’ అంటూ అతని నుంచి మరో మెసేజ్ వచ్చింది. ఆయన ధర్మన్ కథ వివరించారు. కథ నచ్చడం, రజినీ సార్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పేశా’ అని తెలిపింది. కాగా ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్, టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సిరులు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో వైద్యుడిగా రజినీ వెండితెరని పలకరించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో సిమ్రాన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


