జాతీయ అవార్డుగ్రహీత నుంచి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ | Prabhutva Sarayi Dukanam Teaser Out | Sakshi
Sakshi News home page

జాతీయ అవార్డుగ్రహీత నరసింహా నంది నుంచి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’

Sep 17 2025 11:15 AM | Updated on Sep 17 2025 11:20 AM

Prabhutva Sarayi Dukanam Teaser Out

‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాలోని ప్రతి పాత్ర పురాణాల నుంచి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. మనుషుల వ్యక్తిత్వాలు, ఇతర ఆలోచనలన్నింటినీ మా చిత్రంలోని పాత్రలు ప్రతిబింబిస్తాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాం. నాకు చాన్స్‌ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని డైరెక్టర్‌ నరసింహా నంది చెప్పారు. సదన్‌ హాసన్, విక్రమ్‌ జిత్, నరేశ్‌ రాజు, వినయ్‌ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహనా సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. జాతీయ అవార్డుగ్రహీత నరసింహా నంది రచన, దర్శకత్వంలో ఎస్‌వీఎస్‌ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్‌ బ్యానర్స్‌పై దైవ నరేశ్‌ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. 

ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నరసింహా నంది మాట్లాడుతూ– ‘‘గ్రామీణ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో మా చిత్రంలో సరికొత్తగా చూపించాం’’ అని తెలిపారు. ‘‘తొలి ప్రాజెక్ట్‌గా ఇటువంటి మంచి సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా బ్యానర్లో మరో మూడు సినిమాలు రానున్నాయి’’ అన్నారు దైవ నరేశ్‌ గౌడ. 

‘‘ఒక గ్రామంలో జరిగే వాస్తవ ఘటనలకు మహిళా శక్తిని జోడించి, తీసిన సినిమా ఇది’’ అని పరిగి స్రవంతి మల్లిక్‌ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ లాంటి మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సిద్ధార్థ్, నటీనటులు శ్రీలు, మోహనా సిద్ధి, విక్రమ్‌ జిత్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement