breaking news
Prabhutva Sarayi Dukanam Movie
-
ఈ సినిమాను విడుదల కానివ్వం !
సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేశ్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. నరసింహ నంది రచన, దర్శకత్వంలో దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌లోని డైలాగులు అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులు మంగళవారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్‌కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులు దీపా దేవి, నీరజ, ధనమ్మ మాట్లాడుతూ– ‘‘టీజర్లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి చిత్రాన్ని విడుదల కానివ్వం’’ అని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో పద్మ, చంద్రమ్మ, నసీమా తదితరులు ఉన్నారు. -
జాతీయ అవార్డుగ్రహీత నుంచి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’
‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాలోని ప్రతి పాత్ర పురాణాల నుంచి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. మనుషుల వ్యక్తిత్వాలు, ఇతర ఆలోచనలన్నింటినీ మా చిత్రంలోని పాత్రలు ప్రతిబింబిస్తాయి. అందుకే జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. నాకు చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ నరసింహా నంది చెప్పారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేశ్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహనా సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. జాతీయ అవార్డుగ్రహీత నరసింహా నంది రచన, దర్శకత్వంలో ఎస్వీఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్‌పై దైవ నరేశ్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరసింహా నంది మాట్లాడుతూ– ‘‘గ్రామీణ రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో మా చిత్రంలో సరికొత్తగా చూపించాం’’ అని తెలిపారు. ‘‘తొలి ప్రాజెక్ట్‌గా ఇటువంటి మంచి సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నాను. మా బ్యానర్లో మరో మూడు సినిమాలు రానున్నాయి’’ అన్నారు దైవ నరేశ్ గౌడ. ‘‘ఒక గ్రామంలో జరిగే వాస్తవ ఘటనలకు మహిళా శక్తిని జోడించి, తీసిన సినిమా ఇది’’ అని పరిగి స్రవంతి మల్లిక్ పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ సారాయి దుకాణం’ లాంటి మంచి సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు సిద్ధార్థ్, నటీనటులు శ్రీలు, మోహనా సిద్ధి, విక్రమ్ జిత్ పేర్కొన్నారు.


