ప్రభాస్ కల్కి.. వర్షంలో బుజ్జి కోసం బారులు తీరిన ఫ్యాన్స్‌! | Prabhas Nag Ashwin Movie Kalki 2898 AD Bujji Car Video Goes Viral | Sakshi
Sakshi News home page

Kalki Bujji: ప్రభాస్ కల్కి.. వర్షంలోనూ బుజ్జి కోసం ఎగబడుతున్న ఫ్యాన్స్‌!

Jun 30 2024 1:23 PM | Updated on Jun 30 2024 2:52 PM

Prabhas Nag Ashwin Movie Kalki 2898 AD Bujji Car Video Goes Viral

ప్రభాస్‌-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఈనెల 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ భారీ అంచనాల మధ్య రిలీజైన కల్కికి మొదటి రోజే సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రంలో బుజ్జి కారు అభిమానులను తెగ ఆకట్టుకుంది. సినిమా విడుదల రోజు ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్ద సందడి చేసింది. దీంతో అభిమానులు, ప్రముఖులు బుజ్జితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. తాజాగా బుజ్జి విజయవాడకు చేరుకుంది. ఓ షాపింగ్‌ మాల్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఇది చూసిన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తమ కెమెరాలలో బుజ్జిని క్లిక్ అనిపిస్తున్నారు. ఆ థియేటర్ వద్ద భారీగా ఫ్యాన్స్‌ కోలాహాలం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement