హీరో ప్రభాస్.. తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘బాహుబలి’ చిత్రం రెండు భాగాలుగా విడుదలైంది. అదేవిధంగా ‘సలార్, కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలకు కూడా రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫౌజి’ మూవీ కూడా టుపార్ట్స్‌గా ఆడియన్స్ ముందుకు రానుంది. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజి’లో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేశభక్తి అంశాలతో పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే...‘ఫౌజి’ రెండు భాగాలుగా విడుదలకానుంది. ఈ విషయాన్ని హను రాఘవపూడి ఇటీవల స్పష్టం చేశారు.
‘‘ఫౌజి’ తొలి భాగంలో ప్రభాస్‌పాత్ర తాలూకు ప్రపంచాన్ని చూస్తారు. రెండో భాగంలో(ప్రీక్వెల్) ఆయనపాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర సమర యోధుల కథలను, నిజ జీవితంలో నాకు స్ఫూర్తినిచ్చిన వాస్తవ ఘటనలను ప్రీక్వెల్‌లో చూస్తారు’’ అన్నారు హను రాఘవపూడి. 2026 ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్.


