కుబేర నుంచి ఫస్ట్‌ సాంగ్‌.. 'పోయిరా మావా' అంటున్న ధనుష్‌ | Poyiraa Mama Telugu Lyrical Song Out From Dhanush From Kuberaa | Sakshi
Sakshi News home page

కుబేర నుంచి ఫస్ట్‌ సాంగ్‌.. 'పోయిరా మావా' అంటున్న ధనుష్‌

Apr 20 2025 11:39 AM | Updated on Apr 20 2025 11:39 AM

Poyiraa Mama Telugu Lyrical Song Out From Dhanush From Kuberaa

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌(Dhanush)- దర్శకుడు శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్‌ ఆలపించగా భాస్కర్‌ భట్ల లిరిక్స్‌ అందించారు. ధనుష్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది. అక్కినేని నాగార్జున, జిమ్‌ సర్భ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

శేఖర్‌ కమ్ముల అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి ఎస్‌వీసీ ఎల్‌ఎల్‌పీపై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. తొలి పాటలోనే ఆయన మార్క్‌ చూపించారు.

Advertisement
 
Advertisement
Advertisement