అమ్మాయి... సూర్యుడు... జెలాటో | Pooja Hegde Italy Vacation | Sakshi
Sakshi News home page

అమ్మాయి... సూర్యుడు... జెలాటో

Jul 21 2024 12:25 AM | Updated on Jul 21 2024 10:45 AM

Pooja Hegde Italy Vacation

‘‘భగవంతుడు సృష్టించిన ఈ పెద్ద ప్రపంచంలో మనం ఎంత చిన్నవాళ్లమో ప్రకృతి గుర్తు చేస్తుంది. ప్రకృతికి సంబంధించిన ప్రతిదీ చాలా వైశాల్యంతో కూడుకుని ఉంటుంది. చాలా గంభీరంగా, వినయంగా అనిపిస్తుంటుంది. అలాగే ప్రతిదాంట్లోనూ ఓ ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది’’ అంటున్నారు పూజా హెగ్డే.

ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. షూటింగ్స్‌కి కాస్త విరామం రావడంతో విహార యాత్రకు ఇటలీలో వాలిపోయారు పూజా హెగ్డే. అక్కడ పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కలర్‌ఫుల్‌ ఫ్రాక్‌లో సన్‌ గ్లాసెస్‌తో, చేతిలో జెలాటో (ఇటలీలో అన్ని రకాల ఐస్‌క్రీమ్‌లను జెలాటో అంటారు)తో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలను ‘అమ్మాయి... సూర్యుడు... జెలాటో’ అనే క్యాప్షన్‌ ఇచ్చి, షేర్‌ చేశారామె.

అలాగే పడవ ప్రయాణం చేస్తూ, ప్రకృతిని చూసి పరవశించిన వీడియోను షేర్‌ చేసి, పై విధంగా పేర్కొన్నారు. ఇక ఈ హాలిడేలో ఫుల్‌గా రిలాక్స్‌ అయి, ఇండియా వచ్చాక ఓ నూతనోత్సాహంతో పూజా హెగ్డే షూటింగ్స్‌లో పాల్గొంటారని చెప్పాచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement