'ఉప్పెన హీరో.. హిట్ కోసం తంటాలు.. నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?' | Panja Vaisshnav Tej ready work with Hunt Movie Director Mahesh | Sakshi
Sakshi News home page

Vaishnav Tej: 'మెగా హీరోకు హిట్ కష్టాలు.. ఆ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన వైష్ణవ్'

Jun 5 2026 7:50 PM | Updated on Jun 5 2026 8:43 PM

Panja Vaisshnav Tej ready work with Hunt Movie Director Mahesh

ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా ఆకట్టుకుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ మూవీ హిట్ తర్వాత వైష్ణవ్‌కు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత వచ్చిన  ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ పెద్దగా రాణించలేకపోయాయి.

దీంతో సక్సెస్ కోసం మెగా హీరో తంటాలు పడుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్‌లను మెగా హీరో తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కానీ ఇటీవలే ఓ కథకు వైష్ణవ్ ఓకే చెప్పారని లేటేస్ట్ టాలీవుడ్ టాక్. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.

టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో హంట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ మహేశ్‌తో వైష్ణవ్ తేజ్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు వైష్ణవ్ ఓకే చెప్పారట.  మహేశ్ చెప్పిన కథ వైష్ణవ్‌కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement