‘ఓ భామ అయ్యో రామా’ మూవీ రివ్యూ | Oh Bhama Ayyo Rama Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Oh Bhama Ayyo Rama Reviw: ‘ఓ భామ అయ్యో రామా’ హిట్టా ఫట్టా?

Jul 11 2025 4:17 PM | Updated on Jul 11 2025 4:55 PM

Oh Bhama Ayyo Rama Movie Review And Rating In Telugu

టైటిల్‌: భామ అయ్యో రామ
నటీనటులు: సుహాస్, మాళవిక మనోజ్, అనిత హంసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి తదితరులు
నిర్మాణ సంస్థ: వీ ఆర్ట్స్
నిర్మాతలు : హరీష్నల్ల
రచన, దర్శకత్వం: రామ్గోదల
సంగీతం: రథన్
సినిమాటోగ్రఫీ : ఎస్మణికందన్
ఎడిటర్‌: భవిన్ఎం షా
విడుదల తేది: జులై 11, 2025

యంగ్‌ హీరో సుహాస్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకవైపు కాన్సెప్ట్‌ కథలతో అలరిస్తూనే మరోవైపు కామెడీ చిత్రాలతోనూ నవ్విస్తున్నాడు. టాలెంటెడ్హీరో నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై హరీష్నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్కూడా గట్టిగా చేయడంతో 'ఓ భామ అయ్యో రామ'పై హైప్క్రియేట్అయింది. మోస్తరు అంచనాలతో నేడు(జులై 11) ప్రేక్షకుల ముందకు వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
రామ్‌ (సుహాస్‌) చిన్నప్పుడే తల్లి(అనిత హంసానందిని)చనిపోతుంది. మేనమామ(అలీ)నే అన్ని తానై పెంచుతాడు. పెద్ద చదువుల కోసం పారెన్‌ వెళ్లాలనేది తన లక్ష్యం. స్నేహితులంతా సినిమాకు వెళ్తే..మనోడు మాత్రం థియేటర్బయట నుంచే విని.. సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తాడు. మామ, స్నేహితులే ప్రపంచంగా బతుకుతున్న రామ్జీవితంలోకి అనుకోకుండా సత్యభామ(మాళవిక మనోజ్‌) వచ్చేస్తుంది.  బడా వ్యాపారవేత్త(పృథ్వీరాజ్) ఏకైక కూతురే సత్యభామ. ఆమెకు ఎవరైనా నచ్చితే.. వారికోసం ఏదైనా చేసేస్తుంది. రామ్‌ని ఇష్టపడమే కాకుండా అతన్ని సినిమా డైరెక్టర్‌ని చేయాలని ఫిక్సవుతుంది. అతనికి ఇష్టం లేకపోయినా.. స్టార్‌ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరిపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత మూడేళ్ల వరకు మనం కలువొద్దని కండీషన్‌ పెట్టి.. అతనికి దూరంగా వెళ్లిపోతుంది. ఆ మూడేళ్లలో రామ్‌ జీవితం ఎలా మారింది? సత్యభామ.. రామ్‌కి దూరంగా ఎందుకు వెళ్లింది? రామ్‌ తండ్రి ఎవరు? సినిమాలు అంటేనే నచ్చని రామ్‌ని దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నించింది. రామ్‌ దర్శకుడుగా సక్సెస్‌ అయ్యాడా లేదా? చివరకు రామ్‌, సత్యభామ కలిశారా లేదా అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
తెలుగు సినిమా అంటే లవ్‌, ఎమోషన్‌, డ్రామా.. ఇవన్నీ ఉండాలి’ అని సీన్లో హీరో సుహాస్అంటాడు. డైలాగ్కు తగ్గట్టే భామ అయ్యో రామ సినిమా కథ ఉంది. అయితే వాటిని సరిగా వాడుకోవడంలోనే దర్శకుడు కాస్త తడబడ్డాడు.   యూత్ఫుల్లవ్స్టోరీకి మదర్సెంటిమెంట్ని యాడ్చేసి ఫన్వేలో కథనాన్ని నడించారు.  కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. లవ్‌స్టోరీ రొటీన్‌గానే ఉన్నా.. ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే  ఎమోషనల్‌ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. 

హీరో తల్లి చనిపోయే ఎమోషనల్‌ సీన్‌తో కథని ప్రారంభం అవుతుంది. హీరోహీరోయిన్ల పరిచయ సన్నివేశం కాస్త కొత్తగా ఉంటుంది.  హీరోహీరోయిన్లు కలిసిన తర్వాత కథనం ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో  ఎక్కడ ఉంటే అక్కడికి హీరోయిన్‌ వెల్లడం.. బయటకు తీసుకెళ్లి.. కథ చెబుతూ విసిగించడం మొదట్లో బాగున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్‌ కావడం కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. 

 ఇంటర్వెల్‌ సీన్‌ బాగా ప్లాన్‌ చేశారు. సెకండాఫ్‌లో వచ్చే హీరో మదర్‌ ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్‌ పెళ్లి ఎపిసోడ్‌ కామెడీగా ప్లాన్‌ చేసినా..అది వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌ చేసే అల్లరి పనులన్నింటికి.. సెకండాఫ్‌లో మంచి జస్టిఫికేషన్‌ ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు.  అయితే కథను మరింత బలంగా రాసుకొని.. ఫస్టాఫ్‌ విషయంలో ఇంకాస్త కేర్‌ తీసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే.. 
రామ్‌ పాత్రలో సుహాస్‌ ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్లలో చక్కగా నటించాడు. ఇక హీరోయిన్‌ మాళవిక మనోజ్‌కి ఇది తొలి తెలుగు సినిమా. సత్యభామగా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది.  కథనం మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అనిత హంసానందిని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించింది. హీరో తల్లిగా పాత్రలో నటించి అందర్ని సర్‌ప్రైజ్‌ చేసింది.  మదర్‌ సెంటిమెంట్‌ సీన్ల ఈ సినిమాకు హైలెట్‌.  ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతికంగా సినిమా బాగుంది. మణికందన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్రధాన బలం. ప్రతీ సీన్‌ తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. రథన్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. బ్రహ్మకడలి ఆర్ట్‌వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో ఎక్కడ తగ్గలేదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. హీరో మార్కెట్‌, కథని మించి ఖర్చు చేశారు. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement