
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ పేరు వినగానే స్పెషల్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. బాలీవుడ్ పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రం హరిహర వీరమల్లు చిత్రంలోనూ కనిపించనుంది. ఇటీవలే విడుదలైన హౌస్‌ఫుల్-5 మూవీతోనూ ప్రేక్షకులను అలరించింది. చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ది రాయల్స్‌లో నటించిన ముద్దుగుమ్మ ముంబయిలో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. అయితే ఆమె ఏడుస్తూ విమానాశ్రయంలో వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.
అదే సమయంలో ఓ వ్యక్తి ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. ఏడుస్తూ వెళ్తున్న నటితో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె బాడీగార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. సెల్ఫీ కోసం యత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అంతకుముందే నోరా ఫతేహీ తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్‌లో పోస్ట్ చేసింది. అయితే నోరా ఎందుకు అలా వెళ్లారో వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఏడాది బీ హ్యాపీ, హౌస్‌ఫుల్-5 చిత్రాలతో మెప్పించిన నోరా.. చివరిసారిగా ది రాయల్స్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. బాలీవుడ్‌లో ఎక్కువగా ఐటమ్ సాంగ్స్‌తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా స్ట్రీట్ డాన్సర్ 3డీ, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్రాక్, మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ లాంటి చిత్రాలలో కూడా నటించింది.