Nikki Tamboli Pens Emotional Note For Her Late Brother Jatin on His Death Anniversary - Sakshi
Sakshi News home page

Nikki Tamboli: నిన్నెప్పటికీ హగ్‌ చేసుకోలేను, నా వల్ల కావడం లేదు: నటి ఎమోషనల్‌

May 4 2022 5:29 PM | Updated on May 4 2022 6:09 PM

Nikki Tamboli Pens Emotional Note For Her Late Brother on His Death Anniversary - Sakshi

కాలం అన్ని గాయాలను మాన్పుతుందంటారు. కానీ ఏడాదవుతున్నా ఇంకా తొలిరోజు గాయంలా నొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది. నిన్నెప్పటికీ హగ్‌ చేసుకోలేను అని తలుచుకుంటేనే దుఃఖం పొంగుకొస్తుంది.

కరోనా ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. ఆ మాయదారి వైరస్‌ వల్ల అనేకమంది ప్రజలు అర్ధాంతరంగా తనువు చాలించారు. అందులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ నిక్కీ తంబోలి సోదరుడు జతిన్‌ కూడా ఉన్నాడు. గతేడాది మే 4న నిక్కీ సోదరుడు కన్నుమూశాడు. తాజాగా ఆమె తన సోదరుడిని గుర్తు చేసుకుని కుమలిపోయింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాత వీడియోను షేర్‌ చేస్తూ సుదీర్ఘ లేఖను పోస్ట్‌ చేసింది. 'గత ఏడాదిలో 365 రోజులు నాకు కఠినంగా, బాధగానే గడిచాయి. ఎందుకంటే నువ్వు నా పక్కన లేవు కాబట్టి! చాలా మిస్‌ అవుతున్నాను. నువ్వు మమ్మల్ని విడిచి ఏడాదవుతోంది, కానీ ఇంకా నా హృదయంలోని గాయం మాననేలేదు.

కాలం అన్ని గాయాలను మాన్పుతుందంటారు. కానీ ఏడాదవుతున్నా ఇంకా తొలిరోజు గాయంలా నొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది. నిన్నెప్పటికీ హగ్‌ చేసుకోలేను అని తలుచుకుంటేనే దుఃఖం పొంగుకొస్తుంది. స్ట్రాంగ్‌గా ఉండాలని ఎప్పుడూ చెప్తుండేవాడివి కానీ నా వల్ల కావడం లేదు, సారీ. నువ్వెప్పటికీ తిరిగి రావని తెలిశాక ఇంకెలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఓ మనిషిని కోల్పోతే అతడి కుటుంబం ఎప్పటికీ తిరిగి నార్మల్‌ కాలేదు. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలోనూ వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధ అనుభవిస్తూనే ఉంటుంది. గుడ్‌బై డియర్‌ బ్రదర్‌' అని రాసుకొచ్చింది నిక్కీ తంబోలి.

చదవండి: ఓటీటీల్లోకి బీస్ట్‌, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement