స్వయంభూ సెట్‌లో నిఖిల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. | Nikhil Siddhartha Birthday Celebrations in Swayambhu Movie | Sakshi
Sakshi News home page

Nikhil: సినిమా సెట్‌లో హీరో బర్త్‌డే వేడుకలు.. క్యాండిల్స్‌ వెలిగించిన నభా నటేశ్‌

Jun 2 2024 5:54 PM | Updated on Jun 2 2024 6:40 PM

Nikhil Siddhartha Birthday Celebrations in Swayambhu Movie

నిఖిల్‌ బర్త్‌డేను స్వయంభూ సెట్‌లో సెలబ్రేట్‌ చేశారు. స్వయంభూ సినిమాలోని నిఖిల్‌ గెటప్స్‌తో కేక్‌ను ముస్తాబు చేశారు. నభా ఆ కేకుపై క్యాండిల్స్‌ పెట్టి వెలిగిం

'కార్తికేయ 2', '18 పేజీస్‌' సినిమాలతో సూపర్‌ హిట్‌ అందుకున్న నిఖిల్‌ గతేడాది 'స్పై' చిత్రంతో బోల్తా పడ్డాడు. ఈసారి ఎలాగైనా మరో బంపర్‌ హిట్‌ కొట్టాలని కసి మీద ఉన్నాడు. ప్రస్తుతం అతడు పాన్‌ ఇండియా చిత్రం 'స్వయంభూ'లో నటిస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో శ్రీకర్‌, భువన్‌ నిర్మిస్తున్నారు. ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్‌’ వంటి చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్‌  కేకే సెంథిల్‌ కుమార్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు.

శనివారం (జూన్‌ 1) నాడు నిఖిల్‌ బర్త్‌డేను స్వయంభూ సెట్‌లో సెలబ్రేట్‌ చేశారు. స్వయంభూ సినిమాలోని నిఖిల్‌ గెటప్స్‌తో కేక్‌ను ముస్తాబు చేశారు. నభా ఆ కేకుపై క్యాండిల్స్‌ పెట్టి వెలిగించింది. యుద్ధవీరుడి గెటప్‌లో నిఖిల్‌ కేక్‌ ముందు కత్తితో నిలబడ్డాడు. ఆ తర్వాత హీరోయిన్‌తో పాటు అక్కడున్నవారికి కేక్‌ తినిపించాడు. ఈ వీడియోను నిర్మాణ సంస్థ పిక్సెల్‌ స్టూడియో ట్విటర్‌లో విడుదల చేసింది.

 

 

చదవండి: రేవ్‌ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి

Advertisement
 
Advertisement
Advertisement