హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రేమించుకుందాం రా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ | Nidurinchu Jahapana Movie Motion Poster Launch | Sakshi
Sakshi News home page

హీరోగా మారిన మనసంతా నువ్వే చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. ఆరు నెలలు నిద్రపోయి..

Jun 25 2023 5:58 AM | Updated on Jun 25 2023 7:17 AM

Nidurinchu Jahapana Movie Motion Poster Launch - Sakshi

నవమి, ఆనంద వర్ధన్, రోష్ని

‘ప్రేమించుకుందాం..రా’ , ‘సూర్యవంశం’, ‘మనసంతా నువ్వే’ వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన ఆనంద్‌ వర్ధన్‌ హీరోగా నటించిన తొలి చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రోష్ని సాహోత, నవమి గయాక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ దేవరపల్లి దర్శకత్వంలో జి. వంశీకృష్ణ వర్మ, సామ్‌ జీ నిర్మించిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్‌ వర్ధన్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా నాప్రాణం. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్‌టైన్‌ చేయడానికి జీవితాంతం సినిమాల్లోనే ఉంటాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథలో హీరో ఆరు నెలలు కంటిన్యూస్‌గా నిద్రపోతూనే ఉంటాడు. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఇది’’ అన్నారు ప్రసన్న కుమార్‌. నటీమణులు రోష్ని సాహోత, నవమి గయాక్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement