‘బ్లడీ రోమియో’ లాంటి సినిమా ఇంతవరకూ రాలేదు | Nani Says A movie like Bloody Romeo has never been made before | Sakshi
Sakshi News home page

‘బ్లడీ రోమియో’పై నాని క్రేజీ కామెంట్స్.. ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదు

Oct 7 2026 11:31 PM | Updated on Oct 7 2026 11:31 PM

Nani Says A movie like Bloody Romeo has never been made before

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. త్వరలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘బ్లడీ రోమియో’తో సందడి చేయనున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ‘బ్లడీ రోమియో’ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని చెప్పారు. ఇందులో యాక్షన్, వైలెన్స్ ఉన్నప్పటికీ మరీ రా అండ్ రస్టిక్‌గా ఉండదని తెలిపారు.

ఇది చాలా చమత్కారమైన సినిమా. స్టైలిష్ యాక్షన్ ఉంటుంది. సుజీత్ ఈ సినిమాకి ఓ కొత్త ట్రీట్‌మెంట్‌ ఇవ్వనున్నాడు. కేవలం తెలుగులోనే కాదు.. ఈ జానర్‌లో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. ఈ చిత్రం థియేటర్లలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ‘ది ప్యారడైజ్’కు పూర్తి కాంట్రాస్ట్‌గా, చాలా రెఫ్రెషింగ్‌గా ఉంటుందని పేర్కొన్నారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలతో ‘బ్లడీ రోమియో’పై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటివరకు విభిన్న జానర్లలో తనదైన ముద్ర వేసుకున్న నాని, శ్రీకాంత్‌ ఓడెలతో కలిసి ఇటీవల రగ్డ్ పీరియాడిక్ టచ్ ఉన్న ‘పారడైజ్’ తరహా కథ తర్వాత సుజీత్‌తో పూర్తిగా స్టైలిష్ యాక్షన్ జోన్‌లోకి అడుగుపెడుతున్నారు. గన్స్, గర్ల్స్, స్టైలిష్ టేకింగ్, ఎలివేషన్ సీన్స్ అన్నీ కలిపి ఈ చిత్రం ఫుల్ క్లాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని టాక్. యూత్‌కు నచ్చేలా స్టైలిష్‌గా సినిమా తీయగల దర్శకుడిగా సుజీత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నాని వంటి నటుడితో కలయిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ చిత్రం టాలీవుడ్‌కు కొత్త స్టైలిష్ యాక్షన్ ఫేజ్‌ను తెచ్చిపెడుతుందా? అన్నది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement