Nandamuri Kalyan Ram Latest Movie Devil Glimpse Released On His Birthday Special, Goes Viral - Sakshi
Sakshi News home page

Kalyan Ram Devil Glimpse: కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్.. డైరెక్టర్ పేరు లేకుండానే!

Jul 5 2023 5:31 PM | Updated on Jul 5 2023 6:34 PM

Nandamuri kalyan Ram Latest Movie Devil Glimpse Out On Birthday - Sakshi

నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ఉపశీర్షిక.  ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. జూన్ 05న నందమూరి కల్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: అటు మాజీభార్య ఇటు ప్రేయసి.. మధ్యలో ఆమిర్‌ఖాన్!)

అయితే బింబిసారతో సూపర్ హిట్‌ కొట్టిన కల్యాణ్ రామ్‌కు.. అమిగోస్ రూపంలో డిజాస్టర్ ఎదురైంది. దీంతో ప్రస్తుతం కల్యాణ్ రామ్ కాస్తా డిఫరెంట్‌ స్టోరీతో అభిమానుల ముందుకొస్తున్నారు. నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈసారి మాత్రం మరో వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బింబిసార కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.  

గ్లింప్స్ చూస్తే స్టోరీ మొత్తం బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో 'మనసులో ఉ‍న్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండాల్సిన ముఖ్య లక్షణం.' అనే డైలాగ్ ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే గ్లింప్స్‌ వీడియోలో డైరెక్టర్‌ పేరు ఎక్కడా కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. పోస్టర్‌లో కానీ.. వీడియోలో కానీ డైరెక్టర్ పేరు కనిపించలేదు. అయితే దీనికి కారణాలేంటనే విషయంపై ఫ్యాన్స్ తెగ చర్చిస్తున్నారు.

(ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస‍్తున్న స్టార్ హీరోలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement