ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు షాక్ | Nampally Court Given Summons To Allu arjun in Sandhya theatre case | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు షాక్

Jun 19 2026 1:22 PM | Updated on Jun 19 2026 6:35 PM

Nampally Court Given Summons To Allu arjun in Sandhya theatre case

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో బన్నీకి నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్‌ ఏ-11గా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది.

కాగా.. ఈ కేసులో ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి  పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.  2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. నిందితుల వ్యక్తి గత హాజరు తరువాత ఈ కేసులో  నాంపల్లి కోర్టు  ట్రయల్ ప్రారంభించునుంది.

కోర్టుకు రావాల్సిందే..! అల్లు అర్జును నాంపల్లి కోర్టు ఆర్డర్స్

అసలేం జరిగిందంటే..

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రిలీజ్‌ ముందు రోజు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రేవతి కుమారుడు తేజ కోలుకుంటున్నారు. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌ అండగా నిలిచారు. తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement