
హీరో నాగార్జున కెరీర్‌లో రూ పొందనున్న వందో చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కించనున్నట్లు నాగార్జున ఆ మధ్య ఓ సందర్భంలో స్వయంగా తెలిపారు. కాగా దసరా సందర్భంగా నాగార్జున కొత్త సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మించనున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూ పొందనున్న ఈ మూవీకి ‘100 నాటౌట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తన వందో చిత్రం కావడంతో ఘనంగా ప్రారంభించేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారట. కాగా... ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని భోగట్టా. మరి... ‘మనం’ తర్వాత మరోసారి ఈ ముగ్గురూ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? వేచి చూడాల్సిందే.