రానాతో టాక్‌ షో.. పెళ్లి, పిల్లల గురించి నాగచైతన్య ఏం చెప్పారంటే..? | Naga Chaitanya In The Rana Daggubati Show | Sakshi
Sakshi News home page

రానాతో టాక్‌ షో.. పెళ్లి, పిల్లల గురించి నాగచైతన్య ఏం చెప్పారంటే..?

Nov 15 2024 3:33 PM | Updated on Nov 15 2024 3:47 PM

Naga Chaitanya In The Rana Daggubati Show

టాలీవుడ్‌ హీరో  రానా దగ్గుబాటి  హోస్ట్‌గా ఒక టాక్‌ షో రానుంది.  'ది రానా దగ్గుబాటి షో' పేరుతో తాజాగా ఒక ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ  టాక్‌ షో కార్యక్రమంలో సౌత్‌ ఇండియా సెలబ్రిటీలు పాల్గొన్నారు.  ట్రైలర్‌లో మొదట నాగచైతన్య, శ్రీలీల కనిపిస్తే.. రాజమౌళి, నానిలతో రానా ముచ్చట్లు రన్‌ అవుతాయి.  ప్రియాంక మోహన్‌, దుల్కర్‌ సల్మాన్‌, తేజ సజ్జా, రిషభ్‌ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ పాటు రానా సతీమణి మిహికా బజాజ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ టాక్‌ షో స్ట్రీమింగ్‌ కానుంది. నవంబర్‌ 23 నుంచి ప్రతి శనివారం ఒక అతిథితో రానా ప్రేక్షకుల ముందుకు వస్తాడు. సుమారు 10కి పైగా ఎపిసోడ్స్‌ ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. హైదరాబాద్‌లోని   రామానాయుడు స్టూడియోస్‌లో ఈ షో చిత్రీకరించారు. ఫస్ట్‌ ఎపిసోడ్‌ నాగచైతన్యకు సంబంధించినది ఉండొచ్చని తెలుస్తోంది.

రానాతో చాలా సరదా విషయాలు వారందరూ పంచుకున్నారు. అయితే, 'నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు..?' అని చైతూను రానా ప్రశ్నిస్తే.. 'సంతోషంగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు'తో అని నవ్వుతూ బదులిచ్చారు. తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement