అక్కినేని ఇంట పెళ్లి సందడి.. నాగచైతన్య- శోభిత వివాహం అప్పుడేనా? | Naga Chaitanya and Sobhita Dhulipala wedding Date Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Naga Chaitanya- Sobhita: నాగచైతన్య- శోభిత పెళ్లి.. గ్రాండ్‌ వెడ్డింగ్‌ వేదిక అక్కడేనా!

Oct 21 2024 5:12 PM | Updated on Oct 21 2024 5:25 PM

Naga Chaitanya and Sobhita Dhulipala wedding Date Goes Viral On Social Media

అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ పెళ్లి పనులు మొదలైనట్లు శోభిత ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. పసుపు దంచడంతో చైతూ- శోభిత పెళ్లి సందడి మొదలెట్టారు. పెళ్లి పనుల్లో సంప్రదాయ దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే పెళ్లి పనులు మొదలు కావడంతో అందరి దృష్టి వివాహం ఎప్పుడనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. ఈనెలలోనే ఉంటుందా? లేదంటే నవంబర్‌, డిసెంబర్‌లోనా అని అందరు తెగ ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

(ఇది చదవండి: నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు)

తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక డిసెంబర్‌ మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాబోయే జంట నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే వీరి పెళ్లి తేదీ, వేదికపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. ఆ తర్వాతే చైతూ-శోభిత పెళ్లి తేదీలు, వేదికపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement