తెలుగు రాష్ట్రాలకు 'మైత్రీ మూవీ మేకర్స్‌' విరాళం | Mythri Movie Makers Donate Money To AP And Telangana | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు 'మైత్రీ మూవీ మేకర్స్‌' విరాళం

Sep 6 2024 2:57 PM | Updated on Sep 6 2024 3:04 PM

Mythri Movie Makers Donate Money To AP And Telangana

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు నష్టపోయిన బాధితుల కోసం టాలీవుడ్‌ నుంచి విరాళాలు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నటీనటులతో పాటు నిర్మాతలు కూడా వరద బాధితులకు  సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా 'మైత్రీ మూవీ మేకర్స్‌' అధినేతలు రెండు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తమ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు.

భారీ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాచోట్లు బాధితులకు సాయం అందడంలేదని వాపోతున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌  విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రూ. 25 లక్షలు ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని మైత్రీ మూవీస్‌ అధినేతలు నిర్మాత నవీన్ యెర్నేని, రవిశంకర్‌ తెలిపారు. చిత్ర పరిశ్రమ నుంచి మొదటగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.1 కోటి విరాళం ప్రకటించిన తర్వాత చాలామంది స్టార్‌ హీరోలు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement