స్పిరిట్‌లో..? | Mrunal Thakur to play the female lead in Prabhas Spirit | Sakshi
Sakshi News home page

స్పిరిట్‌లో..?

Dec 22 2024 12:11 AM | Updated on Dec 22 2024 12:11 AM

Mrunal Thakur to play the female lead in Prabhas Spirit

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో పోలీస్‌ యాక్షన్‌ డ్రామాగా ‘స్పిరిట్‌’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలిసారిగా పోలీసాఫీసర్‌గా నటించనున్నారు ప్రభాస్‌. ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ దాదాపు పూర్తి కావచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట సందీప్‌ రెడ్డి వంగా. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రను మృణాల్‌ ఠాకూర్‌ చేయనున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. 

అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ నటిస్తారనే ప్రచారం కూడా బీ టౌన్‌లో జరుగుతోంది. ఇక ఆల్రెడీ సౌత్‌ కొరియన్‌ నటుడు డాన్‌ లీ ఈ చిత్రంలో ఓ రోల్‌ చేయనున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి... బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రభాస్‌ సరసన మృణాళ్‌ కనిపిస్తారా? అలాగే కీలక పాత్రల్లో సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ కన్‌ఫార్మ్‌ అవుతారా? అనేది వేచి చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement