బై బై చికాగో | Mrunal Thakur Heartfelt Chicago Goodbye | Sakshi
Sakshi News home page

బై బై చికాగో

Jun 16 2026 2:30 AM | Updated on Jun 16 2026 2:30 AM

Mrunal Thakur Heartfelt Chicago Goodbye

హీరో, హీరోయిన్లు షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఓ వైపు షూటింగ్స్, మరోవైపు ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంటుంటారు. షూటింగ్స్‌కి ఏ మాత్రం విరామం దొరికినా చాలు సేద తీరేందుకు విదేశాల్లో వాలిపోతుంటారు. కుటుంబ సభ్యులతోనో, స్నేహితులనో వెకేషన్‌ ప్లాన్‌ చేస్తుంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటారు.

తమ అనుభూతులను, మధురమైన జ్ఞాపకాలను అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ మృణాళ్‌ ఠాకూర్‌ కూడా తాజాగా చికాగో వెకేషన్‌ని పూర్తి చేశారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా మృణాళ్‌ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కించిన చిత్రం ‘హై జవానీతో ఇష్క్‌ హోనా హై’. ఈ నెల 5న ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొన్నారు మృణాళ్‌.

ఈ మూవీ రిలీజ్‌ తర్వాత వెకేషన్‌ కోసం చికాగో వెళ్లారామె. అక్కడ తనదైన శైలిలో సందడి చేసిన ఈ బ్యూటీ తిరిగి ఇండియాకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ‘‘బ్యాగులు మొత్తం సర్దేశాను.. చికాగో సిటీని వదిలే సమయం వచ్చింది. నిజం చెప్పా లంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది’’ అంటూ ఓ ఎమోషనల్‌ ఎమోజీతో పాటు తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారామె. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement