టాలీవుడ్‌ డైరెక్టర్లపై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు | Megastar Chiranjeevi Comments On Tollywood Directors In Operation Valentine Pre Release, Deets Inside - Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ డైరెక్టర్లపై మెగాస్టార్‌ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

Published Mon, Feb 26 2024 9:40 AM

Megastar Chiranjeevi Comments On Tollywood Directors - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' సినిమా విడుదలకు రెడీగా ఉంది. మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్, సందీప్‌ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి టాలీవుడ్‌ డైరెక్టర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' చిత్రాన్ని డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ కేవలం 75 రోజుల్లోనే చాలా రీజనబుల్‌ బడ్జెట్‌లో తీశాడు. విజువల్స్‌ చూస్తుంటే ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత గొప్ప నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యం కలుగుతోంది. ట్రైలర్‌లో కనిపించిన విమానాల విన్యాసాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది.

డబ్బు ఖర్చు పెడితేనే సినిమాకు రిచ్‌నెస్‌ రాదు. తక్కువ బడ్జెట్‌లో కూడా ఇలా సినిమా తీసి ఎలా రిచ్‌గా చూపించాలో  దర్శకులు ఆలోచించాలి. అప్పుడు నిర్మాతలు బాగుంటారు. ఇండస్ట్రీ బాగుంటుంది.  అందుకే శక్తి ప్రతాప్‌ సింగ్‌ని మన యంగ్‌ డైరెక్టర్స్‌ స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను 'టాప్‌గన్‌' మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. నేడు 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' రూపంలో మనవాళ్లు కూడా చాలా సులభంగా తెరకెక్కించారంటే.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు.. మనం  ఆ స్థాయిలో ఉన్నామని ఈ మూవీ ద్వారా నిరూపించబడుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది.' అని మెగాస్టార్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement