ఎంతో సింపుల్‌గా మనోజ్‌ భార్య మౌనిక సీమంతం.. | Manchu Manoj Wife Mounika Baby Shower In Nandyal | Sakshi
Sakshi News home page

ఇంట్లో సింపుల్‌గా మౌనిక సీమంతం.. వెన్నంటే మనోజ్‌..

Mar 14 2024 4:39 PM | Updated on Mar 14 2024 4:56 PM

Manchu Manoj Wife Mounika Baby Shower In Nandyal - Sakshi

మంచు మనోజ్‌ దంపతుల సంతోషం త్వరలోనే రెట్టింపు కానుంది. వారి కుటుంబంలోకి త్వరలోనే మరో బుజ్జాయి రానుంది. మనోజ్‌ సతీమణి భూమా మౌనిక ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలిసిందే! తను గర్భం దాల్చిన విషయాన్ని మనోజ్‌ దంపతులు గతేడాది డిసెంబర్‌లోనే సోషల్‌ మీడియాకు వెల్లడించారు. 

కవలలు?
ఈ క్రమంలో మౌనిక ప్రెగ్నెన్సీ గురించి కొందరు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆమె కవలలకు జన్మనివ్వనుందని రాసుకొచ్చారు. రెండు రోజుల క్రితమే సదరు వార్తలపై మనోజ్‌ స్పందిస్తూ.. ఏ ప్రచారాన్ని నమ్మవద్దని కోరాడు. ప్రస్తుతం మౌనిక ఏడో నెల గర్భిణి అని.. మే నెలలో ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం వెయిటింగ్‌ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. 

సీమంతం
తాజాగా మౌనిక సీమంతం నంద్యాలలో సింపుల్‌గా జరిగింది. ఇంట్లో బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. పసుపు చీరలో మౌనిక ముఖం వెలిగిపోతుండగా ఆమె పక్కనే నిల్చున్నాడు మనోజ్‌. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా మనోజ్‌- మౌనిక  గతేడాది మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. మంచు లక్ష్మి నివాసంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.

చదవండి: అంబానీ ప్రీవెడ్డింగ్‌ పార్టీలో ఇతడే హైలైట్‌.. తేడా పోజులతోనే ఫేమస్‌..

Advertisement
 
Advertisement
Advertisement