రేవ్‌ పార్టీపై మంచు లక్ష్మీ కామెంట్‌ | Manchu Lakshmi Comments On Rave Party | Sakshi
Sakshi News home page

రేవ్‌ పార్టీపై మంచు లక్ష్మీ కామెంట్‌

May 25 2024 11:20 AM | Updated on May 25 2024 12:06 PM

Manchu Lakshmi Comments On Rave Party

హారర్ బ్యాక్‌డ్రాప్‌తో తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. మంచు లక్ష‍్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలలో నటించిన 'యక్షిణి' వెబ్‌ సిరీస్‌ త్వరలో విడుదల కానుంది. బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఉంది. జూన్ 14 నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అయితే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మీ పలు విషయాల గురించి మాట్లాడింది.

తాను ముంబైకి షిఫ్ట్‌ కావడంతో అందరూ బాలీవుడ్‌కు  వెళ్లానని భావించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. నేను ముంబై మాత్రమే వెళ్లాను. హైదరబాద్‌ నా ఇల్లుతో సమానం. నేను ఏ భాషలో అయినా నటిస్తాను. హాలీవుడ్‌లో నటించిన తర్వాత టాలీవుడ్‌,కోలీవుడ్‌లో చేశాను. అందులో తప్పేముంది. నా కూతురుతో పాటు నా భవిష్యత్‌ కోసమే ముంబై వెళ్లాను. అని మంచు లక్ష్మీ చెప్పింది.

బెంగళూరులో  జరిగిన రేవ్‌ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదని మంచు లక్ష్మీ తెలిపింది. ఆ పార్టీకి వెళ్లిన వాళ్లు ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పింది. పార్టీకి వెళ్లిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సమస్య పార్టీకి వెళ్లిన వ్యక్తులది మాత్రమేనని ఆమె తెలిపింది. దానిలో అందరికీ ఏం సంబంధం ఉంటుందని ఆమె ప్రశ్నించింది. 

Advertisement
 
Advertisement
Advertisement