'మ్యాడ్‌ స్క్వేర్‌' నుంచి సాంగ్‌ విడుదల | Mad Square Movie First Song Out Now | Sakshi
Sakshi News home page

'మ్యాడ్‌ స్క్వేర్‌' నుంచి సాంగ్‌ విడుదల

Sep 20 2024 12:44 PM | Updated on Sep 20 2024 1:04 PM

Mad Square Movie First Song Out Now

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్, సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్‌ స్క్వేర్‌' పేరుతో సీక్వెల్‌ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్‌ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్‌ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక  నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement