హీరో విజయ్‌ విడాకుల రూమర్స్‌.. లియో నటి ఏమందంటే? | Sakshi
Sakshi News home page

Vijay: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్‌? ఈ నటి మాటల్లోనే ఆన్సర్‌ దొరికేసింది!

Published Wed, Nov 8 2023 11:10 AM

Leo Actress Janani Put End Cards to Vijay, Sangeetha Divorce Rumours - Sakshi

అభిమానిని పెళ్లి చేసుకున్న కొద్దిమంది కళాకారుల్లో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఒకరు. సంగీత..  లండన్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబం అమ్మాయి. విజయ్‌ సినిమాలు చూసి అతడికి వీరాభిమానిగా మారిపోయింది. ఆయనను చూడటానికే 1996లో లండన్‌ నుంచి చెన్నై వచ్చింది. విశ్వప్రయత్నాలు చేసి విజయ్‌ను కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్‌ నుంచి వచ్చారా’ అని విజయ్‌ ఆశ్చర్యపోయాడు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతాను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విజయ్‌ పేరెంట్స్‌కు ఆమె బాగా నచ్చేసింది. అప్పుడప్పుడూ సంగీత తన పేరెంట్స్‌తో ఈ హీరో ఇంటికి వచ్చేది. విజయ్‌ పేరెంట్స్‌ ఆమెను పెళ్లిచేసుకోమన్నారు.

విజయ్‌ కష్టసుఖాల్లో తోడుగా సంగీత
విజయ్‌కు కూడా తనపై ఇష్టం ఏర్పడటంతో 1999లో వీరి పెళ్లి జరిగింది. వీరికి కుమారుడు జేసన్‌ సంజయ్‌, కుమార్తె శాషా సంతానం. విజయ్‌ దంపతులు 24 ఏళ్లుగా కలిసిమెలిసి ఉంటున్నారు. విజయ్‌ జయాపజయాలలోనూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంది సంగీత. అయితే ఆ మధ్య వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారంటూ ప్రచారం జరిగింది. ఓ హీరోయిన్‌తో విజయ్‌ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం భార్యను వదిలేయడానికి సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్‌ దంపతులు స్పందించనేలేదు.

భార్య అంటే ఎంత ప్రేమో!
తాజాగా లియో నటి జనని.. దళపతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలతో విజయ్‌ విడాకుల వార్త ఉట్టి పుకారేనని తేలిపోయింది. జనని మాట్లాడుతూ.. 'విజయ్‌తో కలిసి కూర్చునే అవకాశం వచ్చినందుకే పొంగిపోయాను. అతడు నాతో మాట్లాడతాడని కలలో కూడా ఊహించలేదు. నేను శ్రీలంకన్‌ తమిళ్‌​ మాట్లాడుతుంటే ఆయనకు తన భార్య సంగీతాయే గుర్తుకువచ్చేదనేవాడు. ఆమె కూడా నాలాగే శ్రీలంకలోని జఫ్నాలోనే పుట్టిపెరిగిందట. ఈ విషయాన్ని విజయ్‌ నాకు స్వయంగా చెప్పాడు. ఆయన నన్ను తన చెల్లెలిగా చూసుకున్నారు, అలాగే మాట్లాడారు' అని చెప్పుకొచ్చింది. కాగా జనని వ్యాఖ్యలతో విజయ్‌కు సంగీత మీద ఎంత ప్రేముందో అర్థమవుతోందంటున్నారు అభిమానులు.

చదవండి: జీవితం నీటిబుడగలాంటిది, మాటలు రావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యాంకర్‌ ఝాన్సీ పోస్ట్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement