పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా? | Lavanya Tripathi Web Series Miss Perfect Teaser Released Today | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా?

Jan 11 2024 2:59 PM | Updated on Jan 11 2024 3:00 PM

Lavanya Tripathi Web Series Miss Perfect Teaser Released Today - Sakshi

గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.  మెగా హీరో వరుణ్‌ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అభిజిత్, లావణ్య లీడ్‌ రోల్స్‌లో నటించిన మిస్ ఫర్పెక్ట్ అనే సిరీస్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

ఈ సిరీస్‌లో లావణ్య  త్రిపాఠి.. ఓవర్ క్లీన్‌నెస్ (ఓసీడీ) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ సిరీస్‌లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.  అయితే రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. 


 

Advertisement
 
Advertisement
Advertisement