ఆ బాధ నాకు తెలుసు.. అందుకే 'లంబసింగి' నిర్మించా: డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ | Lambasingi Movie Success Meet Director Kalyan Krishna Comments | Sakshi
Sakshi News home page

Lambasingi Movie: ఆ బాధ నాకు తెలుసు.. అందుకే 'లంబసింగి' నిర్మించా

Mar 17 2024 5:36 PM | Updated on Mar 17 2024 5:36 PM

Lambasingi Movie Success Meet Director Kalyan Krishna Comments - Sakshi

కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన సినిమా 'లంబసింగి'. 'బిగ్‌బాస్' ఫేమ్ దివి హీరోయిన్. భారత్ రాజ్ హీరో. 'బంగార్రాజు' డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించాడు. హైదరాబాద్‌లో ఆదివారం ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: కాస్ట్‌లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?)

టాలెంట్ ఉన్నాసరే అవకాశాలు లేక చాలామంది ఉంటారు, నేను కూడా అలా ఛాన్సులు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టా. దివి లాంటి చాలామంది తెలుగమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి. ఈ సినిమాని అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నా అని కల్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు.

కళ్యాణ్ కృష్ణ.. ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. ఈ ఛాన్స్ ఇచ్చిన ఆయనకు స్పెషల్ థాంక్స్. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము అని దివి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: సౌత్ సినిమాలపై కంగన ఇంట్రెస్ట్.. అదే కారణమా?)

Advertisement
 
Advertisement
Advertisement