మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పనున్న అనుష్క- కోహ్లీ​.. ఆ రోజే ఫిక్స్‌ | Sakshi
Sakshi News home page

Anushka And Kohli Second baby: మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పనున్న అనుష్క- కోహ్లీ​.. ఆ రోజే ఫిక్స్‌

Published Sat, Sep 30 2023 12:20 PM

Kohli Anushka Will Get Second Child Goes Viral - Sakshi

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి రంగంలో వారు అగ్రగామిగానే ఉన్నారు. వీరిద్దరి ప్రొఫెషన్‌ వేరు అయినా మొదట ఓ యాడ్‌ షూట్‌ ద్వారా పరిచయం ఏర్పడినట్లు వారు చెప్పారు. అలా మొదలైన స్నేహం ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. అప్పట్లో వారిద్దరి మధ్య ఎన్నో రూమర్స్‌ వచ్చినా వాటిని లెక్కచేయకుండా 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికే వారిద్దరూ కూడా కెరీర్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు.

(ఇదీ చదవండి; Hariteja: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన ఆమె కామెంట్‌)

విరాట్‌ సీక్రెట్స్‌ను తన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అనుష్క ఫిదా చేస్తే... విరాట్‌ కూడా పలు ఇంటర్వ్యూలలో అనుష్కను ఆట పట్టిస్తూ తమ లవ్‌ సీక్రెట్స్‌ను తెలుపుతూ ఉంటాడు.  తాజాగా క్యూట్‌ జంట మరోసారి తల్లిందండ్రులు కానున్నారంటూ సోషల్​ మీడియాలో ఒక వార్త ట్రెండ్​ అవుతోంది. 2021లో ఈ జోడీకి వామిక జన్మించిన విషయం తెలిసిందే. కానీ ఆ చిన్నారి ఫొటోను ఇప్పటి వరకు సరిగ్గా వారు చూపించింది లేదు. కానీ ఈ దంపతులిద్దరూ పాపతో పలు ఫోటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినా అందులో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్త పడేవారు.

ఈ క్రమంలో తాజాగా విరాట్​, అనుష్క తమ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​ చెప్పనున్నారని తెలుస్తోంది. త్వరలో తమ రెండో సంతనానికి సంబంధించిన వార్తను తమ అభిమానులకు షేర్‌ చేయనున్నారని సమాచారం.  అనుష్క ప్రస్తుతం ప్రెగ్నెంట్​గా ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే తాము మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నామని అదికారికంగా విరుష్క జంట ప్రకటించలేదు. నవంబర్‌ 5న విరాట్‌ పుట్టినరోజు ఉంది. బహుశా ఆ సందర్భంగా తమ అభిమానులకు ఈ శుభవార్తను చెప్తారని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: నా ప్రధాని మోదీతో పాటు ఆయనకూ కృతజ్ఞతలు: విశాల్‌)

Advertisement
 
Advertisement