నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్‌ | Bigg Boss Fame Hari Teja Comments On Her Divorce | Sakshi
Sakshi News home page

Hariteja: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన ఆమె కామెంట్‌

Sep 30 2023 7:23 AM | Updated on Oct 1 2023 11:16 AM

Bigg Boss Hari Teja Comments On Her Divorce - Sakshi

హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ ఆన్‌ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మహా చలాకీగా ఉంటుంది. సినిమాల్లో తన యాక్టింగ్‌తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్‌ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు సటైరికల్‌ కామెంట్స్‌తో ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదించుకుందంటూ ఓ ఈవెంట్‌లో ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే.. అందుకే ఆమెకు నితిన్‌,సమంత 'అఆ' సినిమాలో ఛాన్స్‌ ఇచ్చారు ఆయన. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆమె టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచింది.  

(ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు: బుల్లితెర నటి తీవ్ర ఆరోపణలు!)

కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో హరితేజ వివాహమాడింది. వీరికి 2021లో భూమి అనే కూతురు జన్మించింది. ఇక బిడ్డ పుట్టాకా హరితేజ కొద్దిగా బరువు పెరిగినా తర్వాత ఎంతో కష్టపడి బరువు తగ్గడమే కాకుండా చాలా స్లిమ్‌గా తయారయ్యింది. తాజాగా ఈ బ్యూటీ  ఆస్ట్రేలియాలో సింగిల్‌గానే వెకేషన్‌ మూడ్‌లో ఉంది. కుమార్తెను కూడా తన తల్లి దగ్గర వదిలి తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ.

ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో చిట్ చాట్ సెషన్ ప్రారంభించిన హరితేజను ఒక నెటిజన్‌ ఇలా అడిగాడు... మీ భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా...? అని ప్రశ్నించాడు. దీనిని హరితేజ కూడా నవ్వుతూ చాలా హుందాగా తనదైన స్టైల్లో సమాదానం ఇచ్చింది. నాలుగు రోజులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్త దీపక్‌తో ఉ‍న్న ఫోటోను షేర్‌ చేసి విడాకుల కామెంట్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

మరోకరు బుల్లితెర సీరియల్‌ నటి నవ్యతో విడిపోయారా..? అని అడగ్గా అందుకు హరితేజ అది అవదమ్మా.. అంటూ తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంతో బలమైనదని చెప్పింది. అఆ, యూ ట‌ర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో అదిరిపోయే తన నటనతో మెప్పించిన హరితేజకు మరొక మంచి పాత్ర పడితే మళ్లీ సినిమాల్లో బిజీ కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement