తొలిప్రేమ తోపు కాదు.. ఇంట్రెస్టింగ్ 'చెన్నై లవ్ స్టోరీ' | Kiran Abbavaram Chennai Love Story Movie Glimpse | Sakshi
Sakshi News home page

Chennai Love Story: 'బేబి' డైరెక్టర్‌ సినిమాలో కిరణ్ అబ్బవరం.. గ్లింప్స్ రిలీజ్

Jun 2 2025 5:54 PM | Updated on Jun 2 2025 6:38 PM

Kiran Abbavaram Chennai Love Story Movie Glimpse

'బేబి' దర్శకుడు సాయి రాజేశ్.. మరో ప్రేమకథతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. కాకపోతే ఈసారి స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాలున్న వీడియోతో స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' రివ్యూ)

హీరోయిన్ తొలి ప్రేమ ఎంత గొప్పదో చెబుతుంది. హీరోకి మాత్రం తొలిప్రేమపై నమ్మకం ఉండదు. తొలిప్రేమ అంత తోపేం కాదు అనే టైప్. అలాంటి వీళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? ఈ మజిలీలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. రెగ్యులర్‌గా హైదరాబాద్‌లో కాకుండా ఈసారి స్టోరీ సెటప్ అంతా చెన్నైలో ఉండనుంది.

అంటే 'ప్రేమలు' అనే మలయాళ సినిమాలో హైదరాబాద్‌ని చూపించినట్లు.. 'చెన్నై లవ్ స్టోరీ'లో చెన్నైని చూపించబోతున్నారు. గ్లింప్స్‌లో మెరీనా బీచ్, లైట్ హౌస్ చూపించారు. ఇకపోతే ఈ చిత్రానికి ఎస్కేఎన్, సాయి రాజేశ్ నిర్మాతలు కాగా.. రవి నంబూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. త్వరలో రిలీజ్ వివరాలు ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: మేకప్ వల్ల జట్టు ఊడింది.. రెండు రోజులు ఏడ్చా: చైల్డ్ ఆర్టిస్ట్)

Advertisement
 
Advertisement
Advertisement