మేకప్ వల్ల జట్టు ఊడింది.. రెండు రోజులు ఏడ్చా: చైల్డ్ ఆర్టిస్ట్ | Child Artist Harika Shares Gaami Experience Latest Interview | Sakshi
Sakshi News home page

Harika: 'గామి' షూటింగ్.. చైల్డ్ ఆర్టిస్ట్ మేకప్ కష్టాలు

Jun 2 2025 3:21 PM | Updated on Jun 2 2025 3:53 PM

Child Artist Harika Shares Gaami Experience Latest Interview

హారిక.. తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అంటే సుందరానికి, గామి తదితర చిత్రాలు చేసింది. కాకపోతే 'కోయిలమ్మ' సీరియల్‌తో మంచి పేరు సంపాదించింది. తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌లో 'మెర్సీ కిల్లింగ్' చిత్రానికిగానూ బాలనటిగా పురస్కారం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హారిక.. ఓ మూవీ షూటింగ్‌లో తనకెదురైన షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా.. 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి'.. గతేడాది థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఆరేడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం.. డిఫరెంట్ స్టోరీతో తీశారు. ఇందులో హారిక.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. కొన్ని సన్నివేశాల్లో గుండుతోనూ కనిపించింది. ఆ అనుభవం గురించి అడగ్గా.. దాదాపు ఐదు గంటల పాటు మేకప్ వేసేవారని, దాన్ని తీస్తున్నప్పుడు బేబీ హెయిర్ అంతా ఊడిపోయిందని, రెండు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పింది. దీంతో నిర్మాత తనకు ఐస్ కొనిచ్చారని చెప్పుకొచ్చింది.

గామి, అంటే సుందరానికి సినిమాలతో పాటు వీరసింహారెడ్డి, అర్ధ శతాబ్దం, మెర్సీ కిల్లింగ్ తదితర చిత్రాల్లోనూ నటించింది. మూడేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె దాదాపు 13 ఏళ్లుగా పలు మూవీస్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఈమెని సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని అనొచ్చు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: నేను ఇలానే మాట్లాడతా.. బూతుపై రాజేంద్ర ప్రసాద్ దబాయింపు!)

Advertisement
 
Advertisement
Advertisement