నేను ఇలానే మాట్లాడతా.. బూతుపై రాజేంద్ర ప్రసాద్ దబాయింపు! | Actor Rajendra Prasad Reacts Comedian Ali Issue | Sakshi
Sakshi News home page

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. రోజాపై కూడా

Jun 2 2025 1:13 PM | Updated on Jun 2 2025 1:35 PM

Actor Rajendra Prasad Reacts Comedian Ali Issue

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ మళ్లీ నోరు జారి వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఆదివారం హైదరాబాద్‪‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి హాజరైన రాజేంద్ర ప్రసాద్.. కమెడియన్ అలీని ఉద్దేశిస్తూ ఓ బూతు మాట వాడారు. ఇదే వేడుకలో నటి, మాజీ మంత్రి రోజా గురించి కూడా నోరు జారారు. దాన్ని హీరోయిన్ చేసింది నేనే అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ దబాయింపు రీతిలో మాట్లాడారు.

స్టేజీ ఎక్కితే చాలు కొందరు నటులకు నోరు జారుతుంటారు. అలాంటి వాళ్లలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఈ ఏడాది మార్చిలో 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని ఉద్దేశిస్తూ.. ము** కొడకా అని రాజేంద్ర ప్రసాద్ సంబోధించారు. తర్వాత క్షమాపణ చెప్పారు. ఇప్పుడు అలీని ఏకంగా బూతు మాట ఉద్దేశించి పిలిచారు. రోజా గురించి కూడా నోరు పారేసుకున్నారు. ఈ వీడియోలన్నీ వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్‌పై విమర్శలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న కమెడియన్ మహేశ్ విట్టా.. ఫొటోలు వైరల్)

ఈ క్రమంలోనే తాజాగా 'షష్టిపూర్తి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ సోమవారం జరిగాయి. దీనికి హాజరైన రాజేంద్ర ప్రసాద్.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'ఈ మధ్య ఫంక్షన్లలో నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ ఖర్మ. మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. నేనైతే ఇట్లానే సరదాగా ఉంటాను' అని చెప్పుకొచ్చారు.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది ఆయనకు కరెక్ట్ అనిపించొచ్చు. కానీ ఓ సీనియర్ నటుడిగా ఓ స్టేజీపై మాట్లాడుతున్నప్పుడు హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అలానే మాట్లాడాల్సి ఉంటుంది. కానీ రీసెంట్ టైంలో మాత్రం ఈయన కామెంట్స్ విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏది పడితే అది మాట్లాడి, తప్పంతా ప్రేక్షకులదే అన్నట్లు దబాయిస్తున్నారు. ఓ రకంగా ఆయనపై ఉన్న గౌరవాన్ని ఆయనే తగ్గించుకుంటున్నారా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 22 చిత్రాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement