
సీనియర్ నటి నళిని (Actress Nalini) వార్తల్లో నిలిచింది. మొదట్లో హీరోయిన్‌గా అలరించి, ఆ తర్వాత విలన్‌గా గడగడలాడిస్తూనే, కామెడీతో నవ్వించిన ఆమె చెన్నైలో భిక్షాటన చేసింది. తిరువేర్కడులో దేవి కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట శుక్రవారం కొంగుపట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేసింది. ఆమె చేసిన పనిని చూసి చాలామంది భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.
కలలో కనిపించి..
ఈ విషయం గురించి నళిని మాట్లాడుతూ.. అమ్మవారు కలలో కనిపించి తనకోసం ఏం చేస్తావని అడిగిందని చెప్పింది. తనకోసం ఏం చేయాలో తోచక ఇలా కొంగుపట్టి భిక్షం అడుగుతున్నానంది. వచ్చిన కానుకలను, డబ్బును ఆ తల్లికే కానుకగా సమర్పించాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
నళిని కెరీర్
రజనీకాంత్, చిరంజీవి మల్టీస్టారర్ రణువ వీరన్ (1981) సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభమైంది. తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తర్వాత సహాయనటిగా, విలన్‌గా, కమెడియన్‌గానూ యాక్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఇంటిగుట్టు, వీడే, సీతయ్య, పున్నమినాగు, నువ్వెకుండటే నేనక్కడుంటా, ఒక్క అమ్మాయి తప్ప వంటి చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం సీరియల్స్ చేస్తోంది. వ్యక్తిగత విషయానికి వస్తే.. నళిని 1988లో నటుడు రామరాజన్‌ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్ అని కవలలు సంతానం. పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటికీ అతడిని ప్రేమగా ఆరాధిస్తూనే ఉంటుంది నళిని.