కమల్‌ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్‌? | Is Rajinikanth Mediating To Complete Kamal Haasan Indian 3 Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

కమల్‌ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్‌?

Jul 19 2025 12:45 PM | Updated on Jul 19 2025 1:39 PM

Indian 3: Is Rajinikanth Mediating To Complete Kamal Haasan Film

ఓ పెద్ద హీరో సినిమా ఫ్లాప్‌ని మరో పెద్ద హీరో మందుపార్టీతో సెలబ్రేట్‌ చేసుకున్నాడు అంటూ ఆ మధ్య టాలీవుడ్‌ కేంద్రంగా ఒక వార్త గుప్పుమంది. అంతేకాదు తెలుగు హీరోల్లో సఖ్యత మేడిపండు చందమేననేది అనేక సార్లు బహిరంగంగానే రుజువైంది. తెలుగు సినిమా వజ్రోత్సవాలు మాత్రమే కాదు మరికొన్ని బహిరంగ  కార్యక్రమాలు ప్రకటనలు కూడా టాలీవుడ్‌ హీరోలు ముఖ్యంగా సీనియర్స్‌ మధ్య స్నేహం ప్రొఫెషనల్‌ జెలసీలను దాటలేకపోయిందనేది వెల్లడించాయి. 

ఈ నేపధ్యంలో తాజాగా దక్షిణాదిన అగ్రహీరోలైన కమల్‌ హాసన్, రజనీకాంత్‌ల స్నేహ బంధంలోని గాఢత  స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది.  రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్న నేపధ్యంలో మిత్రుడు రజనీని ఇటీవలే కమల్‌ కలవడం శుభాకాంక్షలు స్వీకరించడం మనకు తెలిసిందే. ఇదే సమయంలో కమల్‌ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కాపాడే బాధ్యతను రజనీ భుజాలకెత్తుకున్నాడనే మరో వార్త కూడా వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ని చాటుతోంది.

భారతీయుడు 3ని రక్షించడమే రజనీ తలకెత్తుకున్న ఆ బాధ్యత. తొలి భారతీయుడు’ ఓ  బ్లాక్‌ బస్టర్‌ కాగా, ‘భారతీయుడు 2’ పెద్ద డిజాస్టర్‌. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘భారతీయుడు 2’(Bharateeyudu 3) రిలీజ్‌ టైంలోనే ‘భారతీయుడు 3’ షూటింగ్‌ కూడా 80 శాతం కంప్లీట్‌ అయిపోయింది అని నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు అసలు కథ మొత్తం ‘3వ భాగం’ లోనే ఉంటుందని దర్శకుడు శంకర్‌ చెప్పడం కూబి జరిగింది. సాధారణంగా పార్ట్‌ 2  ప్లాప్‌ అయితే పార్ట్‌ 3 ని దక్షిణాదిలో దర్శక నిర్మాతలు అటకెక్కించేస్తారు.  హాలీవుడ్,  బాలీవుడ్‌లో మాత్రం హిట్స్‌ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సీక్వెల్స్‌ కొనసాగిస్తారు. 

కానీ సౌత్‌ లో ఇప్పటి వరకు .ఒక్క భారతీయుడు మాత్రమే ఆ ఘనతను స్వంతం చేసుకోనుంది.  కాకపోతే ఇప్పుడు భారతీయుడు 3 చుట్టూ రకరకాల సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా ‘2వ భాగం’ ప్లాప్‌ అయ్యింది కాబట్టి.. ‘3వ భాగం’ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్స్‌ ఇంట్రెస్ట్‌ చూపించరు. అంతేకాక గేమ్‌ ఛేంజర్‌ తర్వాత దర్శకుడు శంకర్‌ మార్కెట్‌ దారుణంగా పడిపోయింది. 

ఈ నేపధ్యంలో భారతీయుడు 3’ కంప్లీట్‌ అవ్వాలంటే ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా’ ముందుకు వచ్చి ధైర్యం చేసి మరి కొంత బడ్జెట్‌ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాక మరోపక్క ‘లైకా’ సంస్థ నిర్వాహకులకూ హీరో  కమల్‌ హాసన్‌ కి కూడా మనస్పర్థలు ఉన్నాయని సమాచారం. కాబట్టి.. ఇది అంత సులభంగా తెగే వ్యవహారం కాదు. అందుకే ఈ విషయంలో రజినీకాంత్‌ ఇన్వాల్వ్‌ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు కమల్, మరోవైపు లైకా వారితో రజినీకాంత్‌  కి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి.. రజినీకాంత్‌ ఇద్దరితో మాట్లాడి.. ‘భారతీయుడు 3 మిగిలిన భాగం పూర్తయేలా చొరవ తీసుకోనున్నట్టు సమాచారం. 

అదే జరిగితే దర్శకుడు శంకర్‌ కన్నా సంతోషించేవారు ఎవరూ ఉండకపోవచ్చు. ఏదేమైనా... తన సమకాలీకుడైన పోటీ హీరో చిత్రం సమస్యల్లో ఇరుక్కుంటే సంతోషించడం కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం  రంగంలోకి దిగడం రజనీకాంత్‌ గొప్పతనానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈ తరహా అసూయా ద్వేషాలకు అతీతమైన మనస్తత్వాన్ని అలవరచుకోవడమే తెరబయట కూడా చూపే నిజమైన హీరోయిజం అనేది నిర్వివాదం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement