breaking news
Indian 3 Movie
-
బూజు దులపనున్నారా.. తెరపైకి సీక్వెల్ సినిమా
కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఇండియన్ (భారతీయుడు). 1996లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే కాంబినేషన్లో ఇండియన్– 2 చిత్రాన్ని రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొంటూ దాదాపు నాలుగేళ్ల పాటు నిర్మాణాన్ని జరుపుకుంది. 2024 లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కాగా దీనికి సీక్వెల్‌ను నిర్మించనున్నట్లు ఇండియన్– 2 చిత్ర నిర్మాణ దశలోనే పేర్కొన్నారు. అయితే ఇండియన్ –2 చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఇండియన్– 3 రావడం అసాధ్యమేనే ప్రచారం జరిగింది. ఆ చిత్రం గురించి అందరూ మరిచిపోతున్న తరుణంలో మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కడం విశేషం. ఇండియన్ –3 చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఈచిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై దర్శకుడు శంకర్ వర్గాలను సంప్రదించగా ఇండియన్ –3 చిత్ర నిర్మాణానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా ఈ చిత్రాన్ని అయినా శంకర్ ప్రేక్షకులను రంజంపజేసే విధంగా తెరకెక్కిస్తారా..? అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం గేమ్ చేంజర్, తమిళ చిత్రం ఇండియన్– 2 పూర్తిగా నిరాశపరిచాయి. అదే విధంగా కమలహాసన్ కూడా ఇండియన్– 2, థక్ లైఫ్ చిత్రాలతో ఫ్లాపుల్లో ఉన్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ సంస్థ మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఈ ముగ్గురికి ఇప్పుడు హిట్ చాలా అవసరం కావడం గమనార్హం. అందుకే ఇండియన్3 ప్రాజెక్ట్ బూజు దులుపేందుకు సిద్ధం అవుతున్నారట. -
కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్?
ఓ పెద్ద హీరో సినిమా ఫ్లాప్‌ని మరో పెద్ద హీరో మందుపార్టీతో సెలబ్రేట్ చేసుకున్నాడు అంటూ ఆ మధ్య టాలీవుడ్ కేంద్రంగా ఒక వార్త గుప్పుమంది. అంతేకాదు తెలుగు హీరోల్లో సఖ్యత మేడిపండు చందమేననేది అనేక సార్లు బహిరంగంగానే రుజువైంది. తెలుగు సినిమా వజ్రోత్సవాలు మాత్రమే కాదు మరికొన్ని బహిరంగ కార్యక్రమాలు ప్రకటనలు కూడా టాలీవుడ్ హీరోలు ముఖ్యంగా సీనియర్స్ మధ్య స్నేహం ప్రొఫెషనల్ జెలసీలను దాటలేకపోయిందనేది వెల్లడించాయి. ఈ నేపధ్యంలో తాజాగా దక్షిణాదిన అగ్రహీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్‌ల స్నేహ బంధంలోని గాఢత స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్న నేపధ్యంలో మిత్రుడు రజనీని ఇటీవలే కమల్ కలవడం శుభాకాంక్షలు స్వీకరించడం మనకు తెలిసిందే. ఇదే సమయంలో కమల్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కాపాడే బాధ్యతను రజనీ భుజాలకెత్తుకున్నాడనే మరో వార్త కూడా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని చాటుతోంది.భారతీయుడు 3ని రక్షించడమే రజనీ తలకెత్తుకున్న ఆ బాధ్యత. తొలి భారతీయుడు’ ఓ బ్లాక్ బస్టర్ కాగా, ‘భారతీయుడు 2’ పెద్ద డిజాస్టర్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘భారతీయుడు 2’(Bharateeyudu 3) రిలీజ్ టైంలోనే ‘భారతీయుడు 3’ షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయిపోయింది అని నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు అసలు కథ మొత్తం ‘3వ భాగం’ లోనే ఉంటుందని దర్శకుడు శంకర్ చెప్పడం కూబి జరిగింది. సాధారణంగా పార్ట్ 2 ప్లాప్ అయితే పార్ట్ 3 ని దక్షిణాదిలో దర్శక నిర్మాతలు అటకెక్కించేస్తారు. హాలీవుడ్, బాలీవుడ్లో మాత్రం హిట్స్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సీక్వెల్స్ కొనసాగిస్తారు. కానీ సౌత్ లో ఇప్పటి వరకు .ఒక్క భారతీయుడు మాత్రమే ఆ ఘనతను స్వంతం చేసుకోనుంది. కాకపోతే ఇప్పుడు భారతీయుడు 3 చుట్టూ రకరకాల సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా ‘2వ భాగం’ ప్లాప్ అయ్యింది కాబట్టి.. ‘3వ భాగం’ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. అంతేకాక గేమ్ ఛేంజర్ తర్వాత దర్శకుడు శంకర్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ నేపధ్యంలో భారతీయుడు 3’ కంప్లీట్ అవ్వాలంటే ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా’ ముందుకు వచ్చి ధైర్యం చేసి మరి కొంత బడ్జెట్ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాక మరోపక్క ‘లైకా’ సంస్థ నిర్వాహకులకూ హీరో కమల్ హాసన్ కి కూడా మనస్పర్థలు ఉన్నాయని సమాచారం. కాబట్టి.. ఇది అంత సులభంగా తెగే వ్యవహారం కాదు. అందుకే ఈ విషయంలో రజినీకాంత్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు కమల్, మరోవైపు లైకా వారితో రజినీకాంత్ కి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి.. రజినీకాంత్ ఇద్దరితో మాట్లాడి.. ‘భారతీయుడు 3 మిగిలిన భాగం పూర్తయేలా చొరవ తీసుకోనున్నట్టు సమాచారం. అదే జరిగితే దర్శకుడు శంకర్ కన్నా సంతోషించేవారు ఎవరూ ఉండకపోవచ్చు. ఏదేమైనా... తన సమకాలీకుడైన పోటీ హీరో చిత్రం సమస్యల్లో ఇరుక్కుంటే సంతోషించడం కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగడం రజనీకాంత్ గొప్పతనానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈ తరహా అసూయా ద్వేషాలకు అతీతమైన మనస్తత్వాన్ని అలవరచుకోవడమే తెరబయట కూడా చూపే నిజమైన హీరోయిజం అనేది నిర్వివాదం.